ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇందుకు ముఖ్య కారణం మాత్రం ఆ షోకి హోస్ట్ గా చేసిన జూనియర్ యన్టీఆర్ అని చెప్పుకోవచ్చు. తారక్ తనకి మాత్రమే సొంతమైన స్పాంటేనిటీతో షోని బాగానే రక్తి కట్టించాడు. పైగా.. షోకి తారక్ పెద్ద పెద్ద స్టార్స్ ని గెస్ట్ లుగా తీసుకొచ్చాడు. రామ్ చరణ్, సమంత, రాజమౌళి, కొరటాల శివ వంటి సెలబ్రెటీలు తారక్ కోసమే హాట్ సీట్ పై కూర్చొని ఆట ఆడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మరి కార్యక్రమం మొదలకి రామ్ చరణ్ ని తీసుకొచ్చిన తారక్.., సీజన్ ఎండ్ కి ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబుని రంగంలోకి దింపేశాడు. తాజాగా.. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ప్రోమోలో మహేశ్ అన్న వెల్కమ్ అంటూ తారక్ స్వాగతం పలకగా.., సూపర్ స్టార్ మహేశ్ హాట్ సీట్ పైకి మాస్ ఎంట్రీ ఇచ్చాడు..
ఇక అందరిపైన సెటైర్స్ వేసే తారక్ పైనే మహేశ్ బాబు సెటైర్స్ పేల్చడం ప్రోమోలో హైలెట్ అయ్యింది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి ఇద్దరు పెద్ద స్టార్స్ ని ఒకేసారి ఒకే షోలో చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తుండటం విశేషం. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.