ఈ బ్యూటీ తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది. టాలీవుడ్ లో ఓ సాధారణ కథానాయికగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు స్టార్ హీరోలతో యాక్ట్ చేస్తూ బిజీ అయిపోయింది. ఇంతకీ ఆమెని గుర్తుపట్టారా?
ఆమెని చూస్తే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం కష్టమే! ఎందుకంటే క్యూట్ నెస్ కి కేరాఫ్ లా ఉంటుంది. అందానికి ఆధార్ కార్డ్ లా అనిపిస్తుంది. సంప్రదాయంగా కనిపించడం నచ్చదో ఏమో గానీ ఎప్పుడూ మోడ్రన్ డ్రస్సులోనే పిచ్చెక్కిస్తూ ఉంటుంది. గ్లామర్ ట్రీట్ ఇచ్చే విషయంలో తగ్గేదే లే అన్నట్లు రెచ్చిపోతూనే ఉంటుంది. ఒంపుసొంపుల్ని చూపించడానికి ఏ మాత్రం మొహమాటపడదు. ఆమె.. ఇన్ స్టాలో ఫొటో పోస్ట్ చేస్తే చాలు కుర్రాళ్లు కామెంట్స్ తో రచ్చలేపుతారు. మరి ఇంతలా చెబుతున్నాం కదా.. మరి ఈ హీరోయిన్ ఎవరనేది గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి పేరు కావ్య థాపర్. ఈ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులు లైట్ వెలగకపోవచ్చు. కానీ ‘ఏక్ మినీ కథ’ హీరోయిన్ అంటే కొంతలో కొంతమందైనా గుర్తుపట్టేస్తారు. ముంబయిలో పుట్టి పెరిగిన ఈ భామ.. చదువుతుండగానే మోడల్ అయిపోయింది. ‘పతాంజలి’, ‘మేక్ మై ట్రిప్’, ‘కోహినూర్’ లాంటి బ్రాండ్లకు మోడల్ గా చేసింది. అంతకు ముందే అంటే 2013లోనే ‘తత్కాల్’ అనే హిందీ షార్ట్ ఫిల్మ్ తో నటిగా మారింది. ఇది జరిగిన ఐదేళ్లకు అంటే 2018లో ‘ఈ మాయ పేరేమిటో’ తెలుగు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
దీని తర్వాత అంటే 2019లో ‘మార్కెట్ రాజా MBBS’ సినిమాతో తమిళంలోకి కావ్య థాపర్ ఎంట్రీ ఇచ్చింది. 2021లో తెలుగులో వచ్చిన ‘ఏక్ మినీ కథ’లో సంతోష్ శోభన్ తో కలిసి రెచ్చిపోయింది. కాస్త బోల్డ్ స్టోరీ కావడంతో ముద్దులు విషయంలో అడ్డు చెప్పలేనట్లు అనిపించింది. ఈ ఏడాది రిలీజైన ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ లో చిన్న రోల్ లో కనిపించిన కావ్య.. ప్రస్తుతం బిచ్చగాడు 2, సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రాల్లో నటిస్తోంది. రవితేజ హీరోగా నటిస్తున్న ఓ మూవీలోనూ వన్ ఆఫ్ ది హీరోయిన్ గా ఈ బ్యూటీ చేస్తోంది. సరే ఇదంతా పక్కనబెడితే.. ఈమె చిన్నప్పటి ఫొటో చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.