SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Dulquer Salmaan Is A Biggest Pan India Star

Dulquer Salmaan: ప్రభాస్, NTR, చరణ్, బన్నీ.. వీళ్లని మించిన పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్!

  • Written By: venkybandaru
  • Published Date - Wed - 5 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Dulquer Salmaan: ప్రభాస్, NTR, చరణ్, బన్నీ.. వీళ్లని మించిన పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్!

Dulquer Salmaan: బాహుబలి సినిమా అప్పటి నుంచి పాన్ ఇండియా మూవీ, పాన్ ఇండియా స్టార్ అన్న పేరు బాగా ట్రెండ్ అవుతుంది. అంతకు ముందు కూడా పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి, పాన్ ఇండియా స్టార్లు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ పాన్ ఇండియా ట్రెండ్ కొనసాగడానికి కారణం జక్కన్న. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అన్న పదం వైరల్ గా మారింది. ఆ తర్వాత రోబో 2.O, కేజీఎఫ్, సాహో, పుష్ప, ఆర్ఆర్ఆర్, మొన్న వచ్చిన బ్రహ్మాస్త్ర, రీసెంట్ గా రిలీజైన పొన్నియన్ సెల్వన్ ఇలా పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు వచ్చాయి. ఇక ముందు కూడా రానున్నాయి. అయితే అసలు పాన్ ఇండియా స్టార్ అని మనం అనుకుంటున్న ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్, యష్ ల కంటే ముందే పాన్ ఇండియా మూవీలు చేసి దుల్కర్ సల్మాన్‌ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు.

కానీ మనమెవరం గుర్తించలేదు. అసలు పాన్ ఇండియా మూవీ అంటే సరైన నిర్వచనం చెప్పిన హీరో దుల్కర్ సల్మాన్. ఇతనే అసలైన పాన్ ఇండియా స్టార్. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కొడుకు నుంచి దుల్కర్ సల్మాన్ అంటే ఒక బ్రాండ్ అనే స్టేజ్ కి తనను తాను ట్రాన్స్ఫర్మ్ చేసుకున్నారు. సెకండ్ షో అనే మలయాళ సినిమాతో 2012లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన దుల్కర్.. ఉస్తాద్ హోటల్, విక్రమాదిత్యన్, బెంగళూర్ డేస్, సిఐఏ, చార్లీ వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు. ఆ తర్వాత తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాలు మోపారు. అది కూడా ద్విభాషా చిత్రం. తమిళంలో ‘వాయి మూడి పేసవం’, మలయాళంలో ‘సంసారం ఆరోగ్యథిన్ హానికరం’ అనే సినిమాలతో ఇటు మలయాళం, అటు తమిళంలో కవర్ చేశారు. ఆ తర్వాత మణిరత్నం డైరెక్షన్ లో ‘ఓకే కన్మణి’ సినిమాలో నటించారు.

Dulquer Salmaan is a Biggest pan India star.

Join Our Whatsapp Channel

ఆ సినిమా కల్ట్ క్లాసిక్ హిట్ గా నిలిచింది. తర్వాత మళ్ళీ సోలో అనే ద్విభాషా చిత్రంలో నటించారు. ఇది కూడా తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కింది. ఈ సినిమాలో దుల్కర్.. ఏకంగా నాలుగు పాత్రల్లో నటించారు. దుల్కర్ చూపించే వేరియేషన్స్ మామూలుగా ఉండవు. మలయాళం, తమిళ ఇండస్ట్రీలు అయిపోయాయి, ఇక తర్వాత దుల్కర్ కన్ను తెలుగు ఇండస్ట్రీ మీద పడింది. మహానటి సినిమాతో దుల్కర్ అతి పెద్ద విజయాన్ని అందుకున్నారు. దుల్కర్ పెర్ఫార్మెన్స్ కి తెలుగు ప్రేక్షకులు ముగ్ధులైపోయారు. సహజమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత దుల్కర్ నటించిన మలయాళ, తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. కొన్ని హిట్ అయ్యాయి కూడా. అయితే రీసెంట్ గా రిలీజైన సీతారామం సినిమాతో దుల్కర్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది.

ఇది దుల్కర్ సల్మాన్ చేసిన రెండవ స్ట్రైట్ సినిమా. ఈ సినిమాలో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఈ సినిమాతో దుల్కర్ కి ఇక్కడ అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. ఇక్కడే కాదు, కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా పాన్ ఇండియా స్టార్ రేంజ్ లో దుల్కర్ ని అభిమానించడం మొదలుపెట్టారు. మధ్యలో బాలీవుడ్ ని వదిలేసాం. బాలీవుడ్ లేకుండా పాన్ ఇండియా మూవీ అసంపూర్తిగా ఉంటుంది. కాబట్టి బాలీవుడ్ లో కూడా మన దుల్కర్ బాబు జెండా పాతేశారు. మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్.. ఇక నెక్స్ట్ బాలీవుడ్డే అంటూ ముంబైలో వాలిపోయారు. అక్కడ కర్వాన్ అనే రోడ్ ట్రిప్ కామెడీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది.

Dulquer Salmaan is a Biggest pan India star.

కానీ దుల్కర్ నటనకి బాలీవుడ్ ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినా గానీ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో బాగా ఆడింది. ఆ తర్వాత నటించిన ‘ది జోయా ఫ్యాక్టర్’ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన “చుప్: ది రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్” సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. సెప్టెంబర్ 23న రిలీజ్ అయ్యింది. రికార్డ్ బ్రేకింగ్ స్థాయిలో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ లు అయ్యాయి. అది దుల్కర్ సల్మాన్ రేంజ్ అంటే. వరుసగా రెండు ప్లాప్ లు పడ్డా గానీ ఈ సినిమాకి ఆ స్థాయి బుకింగ్స్ వచ్చాయంటే మామూలు విషయం కాదు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన రక్షా బంధన్ సినిమాల కంటే ఎక్కువ టికెట్లు ఈ సినిమాకి తెగాయి.

ఇలా మలయాళంలో మొదలుపెట్టి.. కోలీవుడ్ వచ్చి.. అక్కడ నుంచి టాలీవుడ్ కొచ్చి.. అక్కడ నుంచి బాలీవుడ్ కి వెళ్లి… ఇలా వెళ్లిన ప్రతీ ఇండస్ట్రీలో హిట్సు, సూపర్ హిట్సు, బ్లాక్ బస్టర్ హిట్సు కొట్టి.. స్థానికంగా ఉండే స్టార్ హీరోలకు పోటీగా అభిమానులను సొంతం చేసుకోవడం అంటే చిన్న విషయమా? ఇంకో విశేషం ఏంటంటే.. దుల్కర్ మలయాళం మాతృభాష కాబట్టి వస్తుంది.. అది కాకుండా తమిళం, తెలుగు, హిందీ భాషలు చాలా స్పష్టంగా, చక్కగా మాట్లాడతారు. అతని సినిమాలకి అతనే డబ్బింగ్ చెప్పుకుంటారు. వేరే వారికి అవకాశం ఇవ్వరు. ఇలా అన్ని భాషల్లో పట్టు ఉండి, అన్ని ఇండస్ట్రీల్లో స్ట్రైట్ మూవీ తీసి హిట్ కొట్టిన హీరో ఎవరైనా ఉన్నారా? ఇప్పటి వరకూ లేరు. కాబట్టి దుల్కర్ సల్మానే అసలైన పాన్ ఇండియా స్టార్ అనేది అభిమానుల మాట. ఇప్పుడు చెప్పండి దుల్కర్ పాన్ ఇండియా స్టార్ కాదంటారా?..

  • ఇవి కూడా చదవండి: GodFather Review: ‘గాడ్ ఫాదర్’ మూవీ రివ్యూ!

Tags :

  • Dulquer Salmaan
  • Movie News
  • Pan India Hero
  • pan india movie
  • Pan india movies
  • Pan India Star
  • tollywood
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • జానీ..జానీ “నో” పాపా..షాక్ ఇచ్చిన ఫెడరేషన్

    జానీ మాస్టర్‌కు భారీ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

    వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

    ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అర్నాబ్ తుఫాన్ బీభత్సం.. ఉప్పాడ బీచ్ రోడ్డు పరిస్థితి చూస్తే షాక్ అవ్వాల్సిందే!

  • అర్నబ్ తుఫాను తీరం దాటితే ఏం జరుగుతుందో తెలుసా?

  • అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఉప్పాడలో ఇళ్లలోకి సముద్రపు నీరు, భయాందోళనలో ప్రజలు

  • కేజీఎఫ్ రికార్డ్ బ్రేక్ చేసిందా? రూ.3 కోట్ల చిన్న సినిమా రూ.135 కోట్ల వసూళ్లు!

  • న్యూజిలాండ్‌తో మూడో టీ20..ఓపెనర్ గా వైభవ్..!

  • విష్వక్ సేన్ కల్ట్ ఫ్యాన్ మీట్‌లో గందరగోళం.. పరిస్థితి అవుట్ ఆఫ్ కంట్రోల్!

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

Most viewed

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • అర్నబ్ తుఫాను తీరం దాటితే ఏం జరుగుతుందో తెలుసా?

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam