దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు నయనతార. హీరోలకు ఏమాత్రం తగ్గని క్రేజ్ ఆమె సొంతం. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ.. ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఆమె చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో నటించింది. అలానే షారుఖ్ ఖాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇక ఈ ఏడాది నయనతార జీవితంలో వరుస సంతోషాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నయనతార.. ఈ ఏడాది జూన్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసింది. దర్శకుడు విఘ్నేష్ శివనన్‌ని వివాహం చేసుకుంది నయనతార. ఇక పెళ్లైన నాలుగు నెలలకే కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యి అందిరికి షాక్ ఇచ్చారు నయనతార-విఘ్నేష్ శివన్ దంపతులు.
అదేంటి పెళ్లై నాలుగు నెలలే అవుతోంది.. పైగా నయనతార ప్రెగ్నెంట్ అనే వార్త కూడా ఎక్కడా రాలేదు.. ఇంత సడెన్‌గా పిల్లలు ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత సరోగసీ ద్వారా ఈ దంపతులు తల్లిదండ్రులయినట్లు పలు మీడియా సంస్థలు వార్తలు రాసుకొచ్చాయి. దీనిపై ఈ జంట ఇంత వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. విఘ్నేష్ శివన్ మాత్రం.. త్వరలోనే అన్ని వెల్లడిస్తాను అంటూ ఇండైరెక్ట్‌గా పోస్ట్ చేశాడు.
ఈ క్రమంలో మరోసారి సరోగసీ అంశం తెరమీదకు వచ్చింది. భారతదేశంలో ఎలాంటి పరిస్థితుల్లో సరోగసీకి అవకాశం కల్పిస్తున్నారు వంటి అంశాపై మరోసారి జోరుగా చర్చ జరిగింది. అంతేకాక.. ఈ విషయంపై నటి కస్తూరి శంకర్ చేసిన ట్వీట్ కూడా వివాదాస్పదంగా మారింది. ఇండియాలో సరోగసీ బ్యాన్ చేశారంటూ.. ఇన్‌డైరెక్ట్‌గా నయనతార దంపతులను ఉద్దేశిస్తూ ట్వీట్ చేసింది. ఇక ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించింది. విచారణ చేస్తామని వెల్లడించింది.
ఇక నయనతార సరోగసీ విధానం ద్వారా తల్లి అయినట్లు తేలితే.. వారికి 5 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. దీని ప్రకారం నయనతార దంపతులు సరోగసీ ద్వారా తల్లిదండ్రులైనా.. వారికి శిక్ష పడే అవకాశం లేదని తెలుస్తోంది. ఎలా అంటే.. సరోగసీ విధానంలో నయన్ దంపతులు బిడ్డలకు జన్మనిచ్చిన మహిళది దుబాయ్ అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సరోగసీ కోసం నయన్ సోదరుడు ఆమెను ఒప్పించాడని.. ఇక దుబాయ్‌లో సరోగసీ విధానం మీద ఎలాంటి నిబంధనలు లేవు కనున నయన్-విఘ్నేష్‌లకు ఎలాంటి సమస్య ఉండబోదని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ వివాదంపై తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని నియమించి.. విచారణకు ఆదేశించింది.ఆసుప్రతి నుంచి ఈ కమిటీ విచారణ ప్రారంభించనుంది. ఇందులో తొలి దశ పూర్తయిన తర్వాతే నయనతార, విఘ్నేష్ శివన్‌లు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. దుబాయ్ మహిళ ద్వారా బిడ్డలను పొందితే.. నయన్ దంపతులు కేవలం విచారణకు హాజరైతే సరిపోతుంది అంటున్నారు. మరి ఈ వివాదం చివరకు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.