Neha Shetty: డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ పాపులారిటీ తెచ్చుకున్నారు హీరోయిన్ నేహా శెట్టి. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకున్నారు. సినిమాలో కొద్దిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించినా మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ బెంగళూరు భామ తెలుగులో ఓ సినిమా చేస్తోంది. ఆ సినిమా షూటింగ్ శరావేగంగా సాగుతోంది. ఇక, నేహాశెట్టి సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు హాట్ ఫొటో షూట్లకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ఇంటర్నెట్లో హీట్ పెంచేస్తుంటుంది.
తాజాగా, నేహా శెట్టి బ్లాక్ డ్రెస్‌లో దిగిన బోల్డ్ ఫొటో షూట్ తాలూకా ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోల్లో ఎంతో హాట్‌గా ఉందామె. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, నేహా శెట్టి ముంగురు మలె 2 అనే కన్నడ చిత్రంతో సినిమాల్లోకి వచ్చారు. 2ం18లో వచ్చిన మెహబూబ ఆమె మొదటి తెలుగు చిత్రం. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించగా పూరీ కుమారుడు ఆకాష్ పూరీ హీరోగా చేశారు. ఆమె తెలుగులో వరుసగా గల్లీ రౌడీస్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, డీజే థిల్లు వంటి సినిమాలు చేశారు. చాకోలెట్ గర్ల్ అనే ఓ వీడియో సాంగ్‌లోనూ నేహా నటించారు.