ఇండస్ట్రీలో సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి రెండూ ఉంటాయి. కాకపోతే సక్సెస్ ఆనందాన్ని కాస్త డిఫరెంట్ గా జరుపుకుంటారు కొంతమంది దర్శకులు, నటీనటులు. ఒక సినిమా తెరకెక్కించాలంటే.. దర్శకుడితో పాటు సహాయ దర్శకుల కష్టం కూడా ఎంతో ఉంటుంది. కొంతమంది సినీ తారలు, దర్శకులు, నిర్మాతలు సినిమా సక్సెస్ అయితే ఆ చిత్ర యూనిట్ కి మంచి బహుమతులు ఇస్తుంటారు.
సాధారణంగా ఓ సినిమా తీయడానికి చిత్ర యూనిట్ ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ సినిమా మంచి సక్సెస్ అయితే అందరూ ఆనందంతో ఉప్పొంగిపోతారు. తమ సినిమా సూపర్ హిట్ అయినందుకు నటీనటులు, దర్శక, నిర్మాతలు సినిమా కోసం కష్టపడ్డవారికి అదిరిపోయే బహుమతులు అందిస్తుంటారు. ఎక్కువగా చిత్ర యూనిట్ కి గోల్డ్ కాయిన్స్ ఇవ్వడం చూస్తూనే ఉంటారు. తాజాగా ప్రముఖ దర్శకులు వెట్రిమారన్ తెరకెక్కించిన ‘విడుతలై’మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సందర్భంగా తన శిష్యులైన అసిస్టెంట్ డైరెక్టర్లకు జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ అందించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో ఒకరు వెట్రి మారన్. హీరో ఇమేజ్ తో ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం బలమైన కథతో చిత్రాలు తెరకెక్కించి అద్భుతమైన విజయాలు అందుకుంటారు. వెట్రి మారన్ తెరకెక్కించే మూవీస్ లో హీరోకి భారీ ఎలివేషన్స్, యాక్షన్ సీన్లు లాంటివి ఏమీ ఉండవు. సాధారణంగా షూటింగ్ సమయాల్లో దర్శకుడికి సగం పనిభారం తగ్గిస్తుంటారు సహాయ దర్శకులు. అందుకే చాలా మంది తమ సహాయ దర్శకులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వారికి అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తుంటారు.. అవసరమైతే పర్సనల్ సహాయం కూడా చేస్తుంటారు. అలాంటి దర్శకుల్లో వెట్రి మారన్ స్టైలే వేరు. తన అసిస్టెంట్ డైరెక్టర్లను చాలా బాగా చూసుకోవడమే కాదు.. వారికి కావాల్సిన గిఫ్ట్స్ ఇవ్వడం.. ఆర్ధిక సహాయం చేయడం లాంటివి చేస్తుంటారు. తాజాగా తమిళ కమెడియన్ సూరిని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ‘విడుతలై’ మూవీ తొలి భాగం గత నెల 31 న రిలీజ్ చేశారు.
ఈ మూవీలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, విజయ్ సేతుపతి ముఖ్య భూమిక పోషించారు. ఈ మూవీ ఎల్ రెడ్డ కుమార్ నిర్మించగా.. ఇళయరాజా సంగీతం అందించారు. రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు.. విమర్శకుల నుంచి ప్రశంసంలు పొందుతుంది. ఈ మూవీ సక్సెస్ కి కారణం అయిన 25 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు వెట్రి మాన్ తలా ఓ ఫ్లాట్ కొనిచ్చారు. అంతేకాదు చిత్ర సభ్యులందరికీ బంగారు నాణేన్ని బహుమతిగా ఇచ్చారు. అంతేకాదు ఈ చిత్రం విజయం సాధించిన ఆనందంలో సంగీత దర్శకుడు ఇళయ రాజా ని కలిసి ధన్యవాదాలు తెలిపారు వెటి మాన్. ఇప్పుడు విడుతలై – 2 పై భారీ అంచనాలు పెరిగిపోయాయి.