Surya Kiran: చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు సూర్య కిరణ్. బాల నటుడిగా 200లకు పైగా సినిమాల్లో నటించటమే కాకుండా.. పదుల సంఖ్యలో అవార్డులను సొంతం చేసుకున్నారు. బాల నటుడిగానే కాదు! దర్శకుడిగా కూడా తన సత్తా చాటారు. సత్యం సినిమాతో దర్శకుడిగా మారి, భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక, 2005లో ప్రముఖ హీరోయిన్ కల్యాణిని వివాహ మాడారు. దాదాపు 10 ఏళ్ల కాపురం తర్వాత విడాకులు తీసుకున్నారు. కల్యాణి, సూర్య కిరణ్ విడాకులు తీసుకోవటానికి కారణం ఇదేనంటూ మీడియాలో పలు పుకార్లు షికార్లు చేశాయి. ఆ పుకార్లపై సూర్య కిరణ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్యాణితో విడాకులకు కారణాలు చెప్పుకొచ్చారు.
సూర్య కిరణ్ మాట్లాడుతూ.. ‘‘ మేం 10 సంవత్సరాలు కాపురం చేశాం. మా మధ్య అభిప్రాయ భేధాలు లేవు. కోర్టులో కారణం కూడా చెప్పలేదు. విడాకుల కోసం జడ్జిని సపరేట్ ఛాంబర్‌లో కలిశాం. కోర్టుకు వెళ్లకుండా. అప్పుడు జడ్జి ‘‘ ఇతను మిమ్మల్ని కొడతారా?.. తిడతారా?.. వాళ్ల ఫాదర్, మధర్ ఇబ్బంది పెడుతున్నారా ?’’ అని కల్యాణిని అడిగారు. వాటన్నింటికి ఆమె ‘ఊహూ..’ అని సమాధానం ఇచ్చింది. మరి ఎందుకు డైవర్స్ అని ఆయన అడిగారు.. నేను కల్యాణి వైపు చూసి ‘చెప్పండి’ అన్నాను. ఆమె ‘ అది…’ అని అంటూ ఉండగా.. ‘మీరు డైవర్స్ తీసుకుంటే పిల్లలు ఎవరి దగ్గర ఉంటారు?’ అని జడ్జి అడిగారు.
మాకు పిల్లలు లేరని చెప్పాను. మీకు పిల్లలు లేకపోవటమే విడాకులకు కారణమా అని జడ్జి అడిగారు. ఆయన అలా తీర్మానం చేయటంతో ‘ఆ! అదే నండి’అని నేను అన్నాను. ఛాంబర్‌నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కల్యాణికి చెప్పా. ‘వేయిట్ చేయండి. అప్పులు తీరిపోయిన తర్వాత మనం మళ్లీ పెళ్లి చేసుకుందాం’ అన్నాను’’ అని విడాకుల గురించి వివరించారు. మరి, కల్యాణితో విడాకులపై సూర్య కిరణ్ క్లారిటీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Adah Sharma: గుర్తు పట్టలేని విధంగా మారిన హాట్ హీరోయిన్.. కటిక పేదరికంలో!