2021, డిసెంబర్ క్రిస్మస్ నాటి నుంచి ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే అన్నవారికి.. సౌత్ ఇండస్ట్రీ భారీ షాకిచ్చింది. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి భారీ చిత్రాలను రిలీజ్ చేస్తూ వచ్చింది. ఇక సౌత్‌లో తెరకెక్కిన ఈ చిత్రాలు అటు ఉత్తరాదిన కూడా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచాయి. వీటిలో ప్రథమ స్థానంలో నిలుస్తుది బన్నీ – సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చి పుష్ప చిత్రం. ఇండియాని మొత్తాన్ని ఈ సినిమా ఓ ఊపు ఊపింది అంటే అతశయోక్తి కాదు. పుష్ప సినిమా తర్వాత బన్నీ, సుకుమార్‌లు పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగారు. సినిమా చూసిన వారంతా పుష్ప చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు.
ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, ‘మున్నాబాయ్ ఎంబీబీఎస్’, ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’, ‘సంజు’ వంటి చిత్రాలు తెరకెక్కించిన రాజ్‌కుమార్ హిరాణీ.. సుకుమార్ వర్క్‌ను ప్రశంసించారు. సుకుమార్ నంబర్ తెలుసుకుని ప్రత్యేకంగా మెసేజ్ పంపించారు. “గుడ్ మార్నింగ్ సుకుమార్ జీ.. నేను రాజు హిరాణీ. ‘పుష్ప’ సినిమా చూసిన నాటి నుంచి మీకు మెస్సేజ్ చేయాలనుకుంటున్నా. కాకపోతే మీ నంబర్ నా వద్ద లేదు. నిన్ననే నేను మహవీర్ జైన్‌ని కలిశా. ఆసమయంలో మేమిద్దరం మీ గురించే మాట్లాడుకున్నాం. అలా, నాకు మీ నంబర్ దొరికింది. ‘పుష్ప’ని మీరు ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. మీ సినిమా గురించి నేను ఎంతోమందితో చెప్పాను. నేను చెప్పే విధానం చూసి నాకేదో అయ్యిందన్నట్లు వాళ్లు ఆశ్చర్యపోయారు’’ అని హిరాణీ ప్రశంసల వర్షం కురిపించారు.కథలో మీరు.. ఒక సీన్‌ని మించి మరొక సీన్‌ని తెరకెక్కించిన విధానం అదిరింది. బన్నీ నటన, సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. గ్రేట్ ఎంటర్‌టైనర్. ఎంజాయ్ చేశా. మీరు ఇలాగే అత్యద్భుతమైన చిత్రాలు తెరకెక్కించాలి. మిమ్మల్ని ఒక్కసారి కలవాలనుకుంటున్నా. ఎప్పుడైనా మీరు ముంబయికి వస్తే తప్పకుండా నాకు ఒక్కసారి ఫోన్ చేయండి” అని హిరాణీ మెసేజ్ చేశారు.
దీనిపై స్పందించిన లెక్కల మాస్టర్ సుకుమార్..”మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్‌గా చెప్పుకునే మీ నుంచి సందేశం రావడం నాకెంతో ఆనందంగా ఉంది. మీరు పంపించిన మెసేజ్‌ని నా స్నేహితులందరికీ ఫార్వర్డ్ చేయడం వల్ల మీకు ఆలస్యంగా రిప్లై ఇస్తున్నాను. ఫిల్మ్ మేకింగ్, కథ రాయడంలో మీరు నాకెంతో స్ఫూర్తి” అని సుకుమార్ హిరాణీకి బదులిచ్చాడు. ప్రసుత్తం వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు హిరాణీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎలాంటి ఇగోలకు పోకుండా.. మరో దర్శకుడి సినిమాను అభినందించిన మీరు గ్రేట్ సార్.. మిమ్మల్ని చూసి చాలామంది బాలీవుడ్ స్టార్స్ ఎంతో నేర్చుకోవాలి అని కామెంట్స్ చేస్తున్నారు.
సౌత్‌లో తెరకెక్కిన చిత్రాలు పాన్ ఇండియా రేంజ్‌లో అదరగొట్టడం.. బాలీవుడ్ చిత్రాలు బిక్కముఖం వేయడంతో పలువురు హిందీ హీరోలు.. సౌత్ సినిమాపలపై తమ అక్కసును వెళ్లగక్కిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో హిరాణీ ఇలా సుకుమార్‌ని ప్రశంసించడం గ్రేట్ అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
.@alluarjun was way ahead of our time https://t.co/zKxJkGXUu2 pic.twitter.com/Ii1oqfrqtt
— Bunny – Youth Icon Of South India (@BunnyYouthIcon) June 11, 2022
Bollywood ace director #rajkumarhirani personally messaged director #Sukumar praising his film #Pushpa 👍👌 pic.twitter.com/hzrRWATHUp
— Suresh Kondi (@SureshKondi_) June 10, 2022