మహేశ్ బాబు.. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఈయన కూడా ఒకరు. ఇప్పుడు వరసు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో హిట్టు కొట్టారు. ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఎస్‌ఎస్‌ఎంబీ 28 మూవీని తెరకెక్కిస్తున్నారు. మళ్లీ వెంటనే మరో సినిమా కూడా ఫిక్స్ చేశారు. ఎస్‌ఎస్‌ఎంబీ 29 సినిమాని దర్శకధీరుడు రాజమౌళితో తెరకెక్కిస్తన్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు మహేశ్ కూడా పాన్ ఇండియా స్థాయి సినిమా ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు. నిజానికి రాజమౌళి సినిమానే ముందు తెరకెక్కుతుందని అన్నారు. కానీ, ఇంక కథ రెడీ కాలదేని.. త్రివిక్రమ్ సినిమాని పట్టాలెక్కించారు. అయితే ఇప్పుడు మహేశ్ తర్వాతి సినిమా గురించి కూడా ఇప్పుడు కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.
అవేంటంటే.. డైరెక్టర్ మెహర్ రమేశ్‌తో మహేశ్ బాబు సినిమా చేయబోతున్నారనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ మాటలు చెప్పింది మరెవరో కాదు.. స్వయంగా మెహర్ రమేశ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. “నేను ప్రస్తుతం భోళా శంకర్ సినిమా పనులతో బిజీగా ఉన్నాను. భోళా శంకర్ సినిమా పూర్తయ్యే వరకు మరే ప్రాజెక్టుల జోలికి వెళ్లడం లేదు. నా పూర్తి కాన్సన్‌ట్రేషన్ మెగాస్టార్ సినిమా మీదే ఉంచాను. వన్స్ ఈ సినిమా పూర్తైన తర్వాత నేను మహేశ్ బాబుతో మాట్లాడతాను. భోళా శంకర్ రిలీజైన రెండు, మూడు నెలల వ్యవధిలోనే సినిమా గురించి డిస్కస్ చేస్తాను. కచ్చితంగా మహేశ్ బాబుతో సినిమా చేస్తాను” అంటూ మెహర్ రమేశ్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం మెహర్ రమేశ్ భోళా శంకర్ సినిమాతో బాగా బిజీగా ఉన్నాడు. సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీలో మెగాస్టార్‌ని కాస్త యంగ్ అండ్ స్టైలిష్ లుక్‌లో చూపిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మాస్ టచ్ ఇస్తూ క్లాస్ అండ్ స్టైలిష్‌గా చిరంజీవిని చూపిస్తున్నాడు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంకా కీర్తీ సురేశ్ కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే యాంకర్ శ్రీముఖి కూడా ఈ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. అటు మెగాస్టార్ కూడా మూవీస్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే గాడ్ ఫాదర్ రిలీజై హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు డైరెక్టర్ బాబీతో వాల్తేరు వీరయ్య సినిమా చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి.. మహేశ్‌తో సినిమాని మెహర్ ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో చూడాలి.