ప్రస్తుతం టాలీవుడ్ లో థియేటర్ల గొడవ నడుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు మరికొంత మంది నిర్మాతలకు మధ్య సంక్రాంతికి బరిలోకి దిగే సినిమాల విషయంలో డిష్కర్షన్ జరుగుతున్న విషయం మనందరికి తెలిసిందే. సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవిమరోసారి థియేటర్ల విషయంలో షాకింగ్ కామెంట్స్ చేసిన దిల్ రాజు! అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు.. నటించిన ‘వాల్తేర్ వీరయ్య’తో పాటుగా నందమూరి నటసింహం నటించిన వీరసింహారెడ్డి కూడా పొంగల్ బరిలో ఉంది. అయితే తెలుగు సినిమాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఇక్కడి నిర్మాతల మండలి పేర్కొంది. ఇక ఇదే సమయంలో తమిళ దళపతి విజయ్ నటించిన ‘వారిసు’.. తెలుగులో వారసుడుగా వస్తోంది. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. తాజాగా మరోసారి థియేటర్ల విషయంపై స్పందించాడు నిర్మాత దిల్ రాజు. అజిత్ కంటే విజయ్ పెద్ద హీరో కాబట్టి మాకు 50 స్క్రీన్స్ ఎక్కువ ఇవ్వాలని సంచలన కామెంట్స్ చేశాడు.
దిల్ రాజు.. టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా రాణిస్తున్నాడు. కథలను జడ్జ్ చేయడంలో అతడికి అతడే సాటి అని ఇండస్ట్రీలో గుర్తింపు ఉంది. అయితే దిల్ రాజు పై తన సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఇతర సినిమాలకు థియేటర్లు ఇవ్వరు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటికి గతంలోనే సమాధానం కూడా ఇచ్చాడు దిల్ రాజు. తాజాగా తన సినిమా ‘వారసుడు’ రిలీజ్ కు ఏర్పడ్డ థియేటర్ల సమస్యపై మరో సారి స్పందించాడు. ఈ సందర్భంగా ఓ ఛానల్ తో దిల్ రాజు మాట్లాడుతూ..”సినిమా అనేది ఒక వ్యాపారం. దానిని ఏ రాష్ట్రంలోనూ తప్పుపట్టడం లేదు. అయితే టాలీవుడ్ లో మాత్రం థియేటర్ల సమస్య అనగానే నేనొక్కడినే అందరికి కనిపిస్తాను” అని దిల్ రాజు పేర్కొన్నాడు.
“బహుశా నేను గ్లామర్ గా ఉండటం వల్లే నన్ను టార్గెట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఇక తమిళనాడులో నా మూవీతో పాటుగా అజిత్ సినిమా కూడా విడుదల అవుతుంది. దాంతో అక్కడ ఉన్న 800 స్క్రీన్స్ లో మాకు సగం.. అజిత్ కు సగం ఇస్తాం అంటున్నారు. అజిత్ కంటే క్రేజ్ లో నంబర్ 1 హీరో విజయ్ కాబట్టి.. నేను చెన్నై వెళ్లి మా సినిమాకు ఇక్కో 50 స్క్రీన్స్ ఇవ్వండి అని అడుక్కుంటాను” అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఇక రెడ్ జెయింట్ బ్యానర్ పై అజిత్ నటించిన సినిమాను హీరో, నిర్మాత అయిన ఉదయనిధి స్టాలిన్ విడుదల చేస్తున్నాడు. నేను ఆయన్ని కలిసి మాట్లాడుతాను అని దిల్ రాజు అన్నారు. విజయ్, అజిత్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని మాకు థియేటర్లు పెంచాలని కోరుతున్నానని దిల్ రాజు తెలిపాడు. అయితే ప్రస్తుతం దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హట్ టాపిక్ గా మారాయి. ఇటు అజిత్ ఫ్యాన్స్ కు అటు విజయ్ ఫ్యాన్స్ కు గొడవలు పెట్టేలా దిల్ రాజు వ్యాఖ్యలు ఉన్నాయని కొందరు సినీ విశ్లేషకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Bold statement by #DilRaju. Being a senior producer, he should’ve avoided the comparison. Isn’t it? pic.twitter.com/vIUGDi7Ls0
— Aakashavaani (@TheAakashavaani) December 15, 2022