ప్రస్తుతం బుల్లితెరపై ట్రెండిగ్ లో ఉన్న షోలలో ఢీ ఒకటని చెప్పొచ్చు. ఆ షోలో సాయి- నైనికా ట్రెండింగ్ జోడీ అనడంలో సందేహం లేదు. ఆన్ స్క్రీన్ వారి మధ్య ఉండే కెమిస్ట్రీ, వారి పర్ఫార్మెన్స్ కు బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఎప్పుడూ వారి రిలేషన్ ఎలా మొదలైంది అనే విషయంపై ఎక్కడా పెద్దగా మాట్లాడలేదు. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం వారి రిలేషన్ ఎలా మొదలైంది అనే విషయాన్ని నైనికా చెప్పేసింది. ‘మొదటిసారి సాయితో కలిసి కపుల్ గా ఓ రీల్ చేశాను. ఆ తర్వాత ఆ రీల్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఇంకొన్ని రీల్స్ చేశాం. మా జోడీ అభిమానులకు బాగా నచ్చింది అనే భావన కలిగింది. ఆ తర్వాత మా మధ్య అండర్ స్టాండింగ్ పెరిగింది’ అంటూ వారి రిలేషన్ గురించి నైనికా చెప్పకనే చెప్పేసింది.