Dhanush: హాలీవుడ్‌లో నటించే అవకాశాలు అందుకున్న అతి కొద్ది మంది భారతీయ నటుల్లో ధనుష్ ఒకరు. ధనుష్ ‘ది ఎక్స్‌ట్రాడ్నరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ సినిమాతో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ వెంటనే ‘ది గ్రే మ్యాన్’ అనే మరో ఇంగ్లీష్ సినిమాలో ప్రముఖ పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నారు. జోయ్ రొస్సో, ఆంథోనీ రోస్సో దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ తారాగణంతో తెరకెక్కింది. ఇందులో క్యాప్టన్ అమెరికా ఫేమ్ క్రిస్ ఇవాన్స్ హీరోగా నటించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా, చిత్ర ప్రీమియర్‌ను నిర్వహించారు. ఈ ప్రీమియర్‌కు ధనుష్ తన ఇద్దరు కుమారులు యాత్ర, లింగాలతో హాజరయ్యారు. ఈ ముగ్గురు ‘ ది గ్రే మ్యాన్’ ప్రీమియర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యాత్ర, లింగాలు తండ్రిలాగా టక్సిడో డ్రెస్‌లో స్టైలిష్‌గా నడుస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. కుమారులతో దిగిన ఫొటోలను ధనుష్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, ధనుష్ నటించిన రెండు సినిమాలు ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హాలీవుడ్ చిత్రం ‘గ్రే మ్యాన్’ ఈ నెల 22 విడుదలవుతుండగా.. ‘తిరుచిత్రాంబళమ్’ అనే తమిళ సినిమా ఆగస్టు 18 విడుదల కానుంది. ఇక, ధనుష్ మరో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆరెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.
వాటిలో ఒకటి ‘నానే వరువేన్’ కాగా, మరొకటి బైలింగువల్ సినిమా. బైలింగువల్ సినిమాకు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో ‘సార్’గా విడుదల కానుంది. మరి, ‘గ్రే మ్యాన్’ ప్రీమియర్‌లో కుమారులతో ధనుష్ సందడిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Neetu Chandra: ఆ బిజినెస్ మ్యాన్ నెలకు 25 లక్షలు ఇస్తాను భార్యగా ఉండమన్నాడు: గోదావరి హీరోయిన్