ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా, టిక్ టాక్ వీడియోల ద్వారా క్రేజ్ సంపాదించుకున్న వారంతా చాలా తక్కువ టైంలో సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ఆ విధంగా టిక్ టాక్ వీడియోలతో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న బ్యూటీ.. దీపికా పిల్లి. మొదట సోషల్ మీడియాలో పేరు తెచ్చుకున్న దీపికా.. సడన్ గా కామెడీ స్టార్స్ అనే కామెడీ షో యాంకర్ గా, డాన్స్ రియాలిటీ షో ‘ఢీ’లో టీమ్ లీడర్ గా కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఎంత సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, ఢీలో హైపర్ ఆది సరసన పండించిన రొమాంటిక్ కామెడీతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
దీంతో అటు యాంకర్ గా స్టేజ్ పై, మరోవైపు సోషల్ మీడియా ఫోటోషూట్స్ లో అదిరిపోయే గ్లామర్ షోతో యూత్ అటెన్షన్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఏకంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కిన ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సుడిగాలి సుధీర్ సరసన నటించిన దీపికాను దర్శకేంద్రుడు తనదైన శైలిలో గ్లామరస్ గా తెరపై ప్రెజెంట్ చేశాడు. దీపికా, సుధీర్ ల మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ కూడా బాగా పాపులర్ అయ్యింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. దీపికా మాత్రం బిగ్ స్క్రీన్ పై కనబడాలనే తన డ్రీమ్ ఫుల్ ఫిల్ చేసుకుందని చెప్పాలి.
అదీగాక డెబ్యూ మూవీనే రాఘవేంద్రరావు కాంబినేషన్ లో పడేసరికి మురిసిపోయింది. ఇక వాంటెడ్ పండుగాడ్ సినిమా తర్వాత అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై పెద్దగా కనిపించలేదు దీపికా. అలాగే సోషల్ మీడియాలో కూడా ఇదివరకటిలా రెగ్యులర్ పోస్టులు ఆపేసింది. కానీ.. చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే దీపికా మళ్లీ అందాలన్నీ ఆరబోస్తూ వీడియోలు పోస్ట్ చేస్తోంది. ప్రస్తుతం దీపికా మాల్దీవ్స్ టూర్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె పోస్ట్ చేస్తున్న వీడియోలు చూస్తే.. ఇట్టే అర్థమవుతుంది. బీచ్ పక్కన రిసార్ట్ లో దీపికా.. ట్రెండీవేర్ లో పొట్టి బట్టలు ధరించి చిల్ అవుతోంది. టాప్ టు బాటమ్ అన్ని వీడియోలో బంధించి పోస్ట్ చేసింది. ఇప్పుడా వీడియో నెట్టింట తెగవైరల్ అవుతోంది.