సమంత తీసిన ‘శాకుంతలం’ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘శాకుంతలం’ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సమంత లీడ్ రోల్ చేసిన ఈ సినిమా ఆశించినంత విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది నెటిజన్లు కావాలనే సమంతను టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. సోషల్ మీడియా వేదికల్లో ఆమెపై దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. సినిమాలో ఆమె నటన అస్సలు బాగోలేదని, అతిగా నటించిందని విమర్శలు చేయటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే సమంత అనారోగ్యం కారణంగా ఇబ్బంది పడుతున్న, ఎమోషనల్ అయిన సంఘటనలను వీడియో చేసి ‘‘ ఆస్కార్ గోస్ టు సమంత.. ఈ నటన ఏదో సినిమాలో చేసి ఉంటే బాగుండేది’ అంటూ ఓ స్థాయికి మించి ట్రోలింగ్స్ మొదలుపెట్టారు.
కొందరు నెటిజన్లు సెలెబ్రిటీలంటే కక్ష ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు. సెలెబ్రిటీలు ఏదో తమ ఇంట్లో బానిసలు అయినట్లు ఇష్టం వచ్చినట్లు ట్రోలింగ్స్ చేస్తున్నారు. సమంత విషయంలోనూ అదే జరుగుతోంది. అసలు విషయం తెలుసుకోకుండా కామెంట్లు చేస్తున్నారు. సమంత గత కొన్ని నెలలుగా మైయోసైటిస్ అనే ఆటోఇమ్యూన్ డిసీజ్‌తో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఎక్కువ సేపు నిలబడలేని పరిస్థితి ఉంది. అంతేకాదు! ఏదైనా ఫంక్షన్లకు వచ్చినపుడు లైట్లు, అరుపులు ఆమెను చిరాకుకు గురి చేస్తున్నాయి. ఆమెకు ఎంత ఇబ్బందిగా ఉన్నా మౌనంగా భరిస్తున్నారే కానీ, తప్పుగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఆమె మౌనాన్ని కొందరు అలసుగా తీసుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. అవతలి వ్యక్తి పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఇలా కామెంట్లు చేయటం ముమ్మూటికి మూర్ఖత్వమే.
సమంతను సోషల్ మీడియాలో తిడుతున్న వారు ఎందరు ఉన్నారో.. అంతకు మించి ఆమెకు మద్దతు లభిస్తోంది. సమంత ఆరోగ్యం గురించి పూర్తిగా అవగాహన ఉన్న వారు కామెంట్లు చేసే వారికి కౌంటర్లు ఇస్తున్నారు. ‘‘ సమంత మైయోసైటిస్‌తో పాటు విడాకులకు సంబంధించిన విషయాల కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఆమెపై కామెంట్లు చేయటం మంచిది కాదు’’..‘‘ సమంత గత కొన్ని నెలల నుంచి మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతోంది. కామెంట్లు చేసే వారు అది గుర్తించండి’’.. ‘‘ మైయోసైటిస్ అనేది చాలా పెద్ద అనారోగ్యం.. దానితో బాధపడుతున్న సమంత పరిస్థితి దారుణంగా ఉంటుంది. కొన్ని సార్లు లైట్ల వల్ల కూడా వారి కళ్లు ఒత్తిడికి గురవుతాయి’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, సమంత అనారోగ్యం గురించి సరైన అవగాహన లేకుండా కామెంట్లు చేస్తున్న వారిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The Oscar goes to 🥳🥳 pic.twitter.com/8SCP9whB54
— Chatrapathi (@Rebel_Kartheek) April 15, 2023