దాస్ అలియాస్ విశ్వక్ సేన్.. 'ధమ్కీ' గట్టిగానే ఇచ్చినట్లు కనిపిస్తున్నాడు. అందుకు తగ్గట్లే కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. తొలిరోజే ఏకంగా అన్ని కోట్లు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ 'ధమ్కీ' వసూళ్ల సంగతేంటి చూసేద్దామా?
ఉగాదికి థియేటర్లలోకి వచ్చిన విశ్వక్ సేన్ ‘ధమ్కీ’.. ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేయడంలో పాస్ అయిపోయింది. పలు చిత్రాలతో దీనికి పోలికలున్నాయని అంటున్నారు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ట్విస్టులు బాగున్నాయని నార్మల్ ఆడియెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే హీరో, దర్శకుడు, నిర్మాతగా ఇలా అంతా తానై నడిపించిన విశ్వక్.. సక్సెస్ కొట్టేశాడనిపిస్తోంది. తొలిరోజు కలెక్షన్స్ లోనూ తన మార్క్ చూపించాడంతోపాటు తన గత చిత్రాల వసూళ్ల మార్క్ ని కూడా ‘ధమ్కీ’తో బ్రేక్ చేసి పడేశాడని తెలుస్తోంది. మరి ఫస్డ్ డే ‘ధమ్కీ’కి ఎన్ని కోట్లు వచ్చాయి? ఏంటి సంగతి అనేది ఇప్పుడు చూద్దాం?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ మధ్య కాలంలో కాస్తలో కాస్త ఆసక్తి కలిగించిన సినిమా ‘దాస్ కా ధమ్కీ’. యాక్టర్ కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్.. ఇలా అన్నీ విశ్వక్ సేన్ కావడం, దానికి తోడు ఈ మూవీపై అతడు పూర్తి నమ్మకంగా ఉండేసరికి ప్రేక్షకులు కూడా కాస్త ఇంట్రెస్ట్ చూపించాడు. ఆ అంచనాలతోనే థియేటర్ లో అడుగుపెట్టారు. స్టోరీ తెలిసిందే అయినా ట్విస్టులు బాగున్నాయని చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. అలా తొలిరోజే అటు ఓవర్సీస్ తోపాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయిందని మాట్లాడుకుంటున్నారు.
ఇక ధమ్కీ ఫస్ట్ డే కలెక్షన్స్ చూసుకుంటే.. ఓవర్సీస్ లో 150k డాలర్లకు పైగా వసూళ్లు సాధించిందని అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. మన కరెన్సీ ప్రకారం.. ఓవర్సీస్ కలెక్షన్స్ కోటి 23 లక్షలకు పైగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్లకుపైనే గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఇక వరల్డ్ వైడ్ చూసుకుంటే.. మొత్తంగా తొలిరోజు రూ. 8.88 కోట్లు ‘ధమ్కీ’ మూవీ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయమై తాజాగా ఆఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశాడు హీరో విశ్వక్ సేన్. కాగా.. ధమ్కీ ఓపెనింగ్స్ రూ. 8.88 కోట్లుగా వచ్చేసరికి.. విశ్వక్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ గా నమోదైందని సమాచారం. మరి విశ్వక్ ‘ధమ్కీ’ మొదటిరోజు వసూళ్లపై మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.
#DasKaDhamki: For the innumerable time, Egg on the faces of Early Reviewers with US Audience giving it a sizeable opening for premiers with decent hold on Day 1. pic.twitter.com/9X1Bti9vfJ
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) March 23, 2023