Crime Branch Summons To Kavya Madhavan: ప్రముఖ హీరోయిన్ భావన మీనన్ కిడ్నాప్, దాడి కేసులో నటి కావ్య మాధవన్‌కు క్రైం బ్రాంచ్ శుక్రవారం సమన్లు జారీ చేసింది. ప్రధాన నిందితుడు దిలీప్ భార్య అయిన కావ్య విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఏప్రిల్ 11, సోమవారం విచారణకు హాజరు కావాలని తెలిపింది. సోమవారం అలువ పోలీస్ క్లబ్‌లో ఈ విచారణ జరగనుంది. అయితే, ఇంతకు ముందు ఓ సారి క్రైం బ్రాంచ్ ఆమెకు సమన్లు జారీ చేసింది. ఆమె ఊర్లో లేదని తెలపటంతో విచారణ వాయిదా పడింది. దీంతో మరో సారి సమన్లు జారీ చేసింది.
కాగా, 2017లో హీరోయిన్ భావనపై దిలీప్ కిడ్నాప్, దాడి చేయించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి దిలీప్ జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలయ్యారు. విచారణ కొనసాగుతున్న సమయంలో సంబంధిత అధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్పులు కూడా బయటకు వచ్చాయి. ఈ ఆడియో క్లిప్పుల్లో భావనపై దాడి జరగటానికి ప్రధాన కారణం దిలీప్ భార్య కావ్య మాధవన్ అని ఉంది. దీంతో క్రైం బ్రాంచ్ కావ్య మాధవన్‌ను విచారణకు ఆదేశించింది. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట భారీ చోరీ.. నగలు, డబ్బుతో పరారీ!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.