పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస బిగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు రాధేశ్యామ్ విడుదలకు రెడీగా ఉంది. మరోవైపు ఆదిపురుష్, సలార్ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇటీవలే ఆదిపురుష్ సినిమాని పాన్ వరల్డ్ రేంజిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని వార్తలొచ్చాయి. తాజాగా ప్రభాస్ సలార్ గురించి ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా దృష్టిని తనవైపు తిప్పుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. తెరకెక్కిస్తున్న సలార్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ప్రశాంత్ తెరకెక్కించిన కేజీఎఫ్-2 విడుదలకు రెడీగా ఉంది. అసలు మాఫియా జానర్ లో హీరోయిజం, ఎలివేషన్స్ లో ప్రశాంత్ తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. అలాంటిది డార్లింగ్ ప్రభాస్ తో సినిమా అనేసరికి అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Double Mass🔥💥#Prabhas #Salaar pic.twitter.com/BbhWhHrwjl
— PrabhasWarriors (@PrabhasWarrior_) January 29, 2022
తాజా సమాచారం ప్రకారం.. సలార్ సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతుందని వార్త ఇండస్ట్రీ వర్గాలలో వైరల్ అవుతోంది. అసలే వరుస పాన్ ఇండియా స్థాయి మించి సినిమాలను లైనప్ చేసుకున్న ప్రభాస్ నుండి సలార్ సాలిడ్ యాక్షన్ తో రూపొందుతుంది. ఇంతవరకు చూడని వయోలెంట్ క్యారెక్టర్ లో ప్రభాస్ కనిపించనున్నాడని సలార్ లుక్ చూస్తేనే అర్ధమవుతుంది. మరి సలార్ టు-పార్ట్స్ గా వస్తే మాత్రం బాక్సాఫీస్ బద్దలైపోతుందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Most Violent Man, #Salaar getting ready to entertain us in two parts!!! pic.twitter.com/lU38WzlmZ3
— Aakashavaani (@TheAakashavaani) January 29, 2022
ఈ విషయం పై మేకర్స్ నుండి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం సలార్ రెండు భాగాలుగా రాబోతోందనే వార్త ట్రెండ్ సృష్టిస్తోంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నాడు. ఇక ప్రభాస్ చేతిలో ప్రాజెక్ట్ కే, స్పిరిట్ లైన్ లో ఉన్నాయి. మరి సలార్ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రుపంలో తెలియజేయండి.