CPI Narayana: ఈ మధ్య కాలంలో సీపీఐ నాయకుడు కే నారాయణ వివాదాలకు తావిచ్చేలా కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో చిరంజీవిపై తీవ్రస్థాయిలో కామెంట్లు చేశారాయన. చిరంజీవిని కించపరిచేలా మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర దుమారం చెలరేగింది. మెగా ఫ్యాన్స్ ఆయనపై విరుచుకుపడ్డారు. తిట్ల దండకం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయన రియలైజ్ అయ్యారు. చిరంజీవికి క్షమాపణ చెప్పారు. తాజాగా, మరోసారి నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ సారి జూనియర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేశారు. అమిత్‌షాను ఆయన కలవటాన్ని తప్పుబట్టారు. నారాయణ మాట్లాడుతూ.. ‘‘ ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అమిత్‌షా ఓ స్మగ్లర్. జూనియర్ ఎన్టీఆర్ ఓ గౌరవ ప్రదమైన కుటుంబంనుంచి వచ్చారు. అలాంటి మనిషి ఏం అవసరం వచ్చిందని ఓ క్రిమినల్‌ను కలిశారు’’ అని అన్నారు. కాగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కొద్దిరోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే.
దాదాపు అరగంటకుపైగా ఈ భేటీ సాగింది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటన నచ్చి ఆయనతో భేటీ అయినట్లు అమిత్‌షా తెలిపారు. కానీ, ఆ భేటీ రాజకీయ పరమైన విషయాలకు తావిచ్చి ఉంటుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టాలీవుడ్ హీరో నితిన్‌ను కలిశారు. మరి, జూనియర్ ఎన్టీఆర్‌పై సీపీఐ నాయకుడు నారాయణ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Tiger Shroff: విమానంలో సె*క్స్ చేశా.. ఆ విషయాలు బయటపెట్టిన హీరో టైగర్ ష్రాఫ్!