మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. టాలీవుడ్ లో ఈ పేరుకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రీల్ లైఫ్ లో స్టార్ అయినా.. రియల్ లైఫ్ లో మాత్రం చరణ్ లివింగ్ స్టయిల్ మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ.., కార్స్, వాచ్ విషయంలో మాత్రం రామ్ చరణ్ దీ బెస్ట్ కోరుకుంటారు. ఇందుకే.. “రెడ్ స్వాంకీ” లాంటి లగ్జరీ కార్ వాడుతున్నాడు చరణ్. కార్ కాబట్టి.. దాని రేంజ్ ఏంటో, దాని స్పెషాలిటీ ఏంటో చాలా మందికి తెలుసు. కానీ.., రామ్ చరణ్ వాడే వాచ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా? ఆ వాచ్ కాస్ట్ తెలిస్తే.. మీరు నోర్లు వెళ్ళబెట్టడం ఖాయం. మరి.. ఆ వాచ్ ఏమిటో? దానిలో ఉన్న అంత స్పెషల్ ఫీచర్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రామ్ చరణ్ వాడేది మోస్ట్ పాపులర్.. “రిచర్డ్ మిల్లే RM 61” టైటానియం వాచ్. ఒలింపిక్స్ లో 100 మీటర్స్, 200 మీటర్స్ వరల్డ్ సెకండ్ ఫాస్టెస్ట్ రన్నర్ గా నిలిచిన యోహన్ బ్లేక్ కోసం.. రిచర్డ్ మిల్లే కంపెనీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన మోడల్ వాచ్ ఇది. ఆ తరువాత నుండి ఈ వాచ్ కి డిమాండ్ పెరిగిపోయింది. రిస్ట్ రన్ మిషన్ గా పేరు ఉన్నఈ వాచ్ హైట్ 50.23 మిల్లీ మీటర్స్. విడ్త్ 42.70 మిల్లీ మీటర్స్. హ్యాండ్ వైండింగ్ టైప్ అయిన ఈ వాచ్ స్కెలిటన్ కాంప్లికేషన్ లో ఉండటం విశేషం.
బ్లాక్ కలర్ రబ్బర్ స్ట్రిప్ తో పాటు.., యల్లో, గ్రీన్ కాంబోతో డైల్ కలర్స్ రావడం ఈ వాచ్ కి గ్రాండియర్ లుక్ వచ్చింది. దీనికి సాప్ఫైర్ గ్లాస్ మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఇక 100 పర్సెంట్ వాటర్ రెసిస్టెన్సీ కలిగిన ఈ వాచ్ కాస్ట్ ఎంతో తెలుసా? జస్ట్ 117 500 యూరోలు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.1,02,29,080 అనమాట! అంత ఆశ్చర్యపోకండి.. రిచర్డ్ మిల్లే లో ఈ మాత్రం కాస్ట్ చాలా మామూలే.
ఓసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ ఇదే కంపెనీకి చెందిన ఓ స్పోర్ట్స్ వాచ్ ని ధరించాడు. దాని కాస్ట్ ఎంతో తెలుసా? అక్షరాల 7 కోట్ల రూపాయలు. సో.. ఇదన్నమాట రామ్ చరణ్ వాడుతున్న వాచ్ కంపెనీ రేంజ్. RC-15 లాంచ్ ఈవెంట్ లో రామ్ చరణ్ ఈ వాచ్ పెట్టుకుని కనిపించడంతో.. ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
“ఆయన వాచ్ అమ్మితే.. మీ బ్యాచ్ సెటిల్ అయిపోవచ్చు” అన్న తన బాబాయ్ సినిమా డైలాగ్ ని.. అబ్బాయి చరణ్ ఇలా రియల్ లైఫ్ లో నిజం చేసి చూపించాడు అన్నమాట. మరి.. చూశారు కదా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాచ్ స్పెషాలిటీ. ఈ వాచ్ కాస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రీపంలో తెలియచేయండి.