తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటేనే హాస్యనటులకు పుట్టినిల్లు. ఏ భాషలో లేనంత మంది కమెడియన్స్ మన దగ్గరున్నారు. సినిమా ఏదైనా సరే వాళ్ల మొదటి లక్ష్యం ప్రేక్షకులని నవ్వించడమే. ఒకప్పటి రాజబాబు దగ్గర నుంచి ఇప్పటి వెన్నెల కిశోర్ వరకు మనకు ప్రతి సినిమాతోనూ నవ్విస్తూనే ఉన్నారు. ఇక సుత్తి వీరభద్రరావు అనే వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. డైలాగ్ డెలివరీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. 80-90 దశకంలో ఎన్నో హాస్యభరిత పాత్రలు పోషించారు. అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సుత్తి వీరభద్రరావు అసలు పేరు మామిడిపల్లి వీరభద్రరావు. చదువు పూర్తయిన తర్వాత తండ్రి చూపించిన ఉద్యోగం చేయలేదు. తనకి నచ్చిన నాటకాల్లో నటించేందుకు వీలుగా ఆకాశవాణిలో చేరారు. అలా దాదాపు ఇరవై ఏళ్లపాటు అక్కడే ఉద్యోగం చేసిన ఆయన.. 1980లో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ‘బలిపీఠం’ సినిమాతో కెరీర్ ప్రారంభించారు. హాస్యభరిత చిత్రాల తీయడంలో దిట్ట అయిన జంధ్యాల ఈయనకు మంచి స్నేహితుడు.
ఇక జంధ్యాల తీసిన ‘నాలుగు స్థంబాలట’ సినిమా సుత్తి వీరభద్రరావుకి చాలా గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలో.. మంత్రిగారి వియ్యంకుడు, అహ నా పెళ్లంట!, చూపులు కలిసి శుభవేశ, మూడు ముళ్లు, రెండు జళ్ల సీత, ఆనంద భైరవి, కాంచన గంగ, శ్రీవారికి ప్రేమలేఖ, స్వాతిముత్యం.. ఇలా చెప్పుకుంటే పోతే దాదాపు 50 సినిమాల్లో నటించారు. ఓ చిన్న పొరపాటు చేయడం.. ఈయన ప్రాణాలు మీదకొచ్చింది. ఆయన చనిపోవడానికి కారణమైంది.
1988లో జంధ్యాల ‘చూపులు కలిసిన శుభవేళ’ సినిమా తీస్తున్నారు. హైదరాబాద్ లో ఓరోజు పాట షూటింగ్ జరుగుతున్న టైమ్ లో వీరభద్రరావుకి కాలు బెణికింది. అప్పటికే షుగర్ ఉన్న ఆయనకు చికిత్స, విశ్రాంతి అవసరమని డాక్టర్స్ చెప్పారు. ఇక షూటింగ్ పూర్తయిన తర్వాత చెన్నై వెళ్లి, ఆయన చికిత్స తీసుకున్నారు. అయితే రాత్రి నిద్రపోయేందుకు ఓ ఇంజెక్షన్ వేసుకోవడంతో అదికాస్త వికటించింది. దీంతో ఆయనకు గుండెపోటు వచ్చి మరణించారు. ఒకవేళ డాక్టర్స్ చెప్పినట్లు, మొదట్లోనే విశ్రాంతి తీసుకుని ఉంటే సుత్తి వీరభద్రరావు బతికేవారేమో! మరి చిన్న పొరపాటు వల్ల ఆయన హఠాన్మరణం చెందడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: మరణం విషయంలో కృష్ణంరాజు కోరిక ఇదే.. అలా కన్నుమూయాలనుకున్నారు!