Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్డమ్ దృష్టిలో పెట్టుకొని తదుపరి సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిన చరణ్.. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ తో ‘RC15’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. నటుడిగా స్టార్ గా ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఉన్నవాళ్లలో చరణ్ ఒకరు. చాలా సింపుల్‌గా తన తోటి నటీనటులతో సరదాగా కలిసిపోతాడు. తాజాగా చరణ్ పర్సనల్ చార్టర్డ్ ఫ్లైట్‌లో కమెడియన్ సత్య కనిపించడం హట్ టాపిక్ గా మారింది.
మామూలుగా స్టార్ హీరోలు తమ పర్సనల్ ఛార్టర్డ్ ఫ్లైట్ ఉపయోగిస్తుంటారు. ఫ్యామిలీ.. పర్సనల్ స్టాఫ్ తప్ప దాదాపు ఎవరు కూడా ఆ ఫ్లైట్ ఎక్కే ఛాన్స్ ఉండదు. అయితే.. ఇప్పుడు రామ్ చరణ్ పర్సనల్ ఫ్లైట్ లో కమెడియన్ సత్య కనిపించడం విశేషం. ఛార్టడ్ ఫ్లైట్‌లో సత్య భుజంపై చేయి వేస్తూ.. రామ్ చరణ్ ఎంతో సింపుల్‌గా దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ చేతిలో అతడి పెట్ కూడా ఉండటం మనం ఫోటోలలో చూడవచ్చు.
ప్రస్తుతం చరణ్ – సత్యల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలపై చరణ్ ఫ్యాన్స్ స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చరణ్ మంచితనం అది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో చరణ్ గురించి సత్య చేసిన వ్యాఖ్యలు కూడా గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ‘రామ్ చరణ్ ఇతరులకు సహాయం చేసినప్పటికీ.. ఆ సహాయం గురించి చెప్పుకోరని, అలాంటి వ్యక్తులు చాలా తక్కువమంది ఉంటారు. నేను ఆర్టిస్ట్ గా స్ట్రగుల్ అవుతున్న సమయంలో చరణ్ డబ్బులు ఇచ్చి సహాయం చేశారని’ అన్నాడు సత్య. ప్రస్తుతం చరణ్ – సత్యల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Actor #satya with @AlwaysRamCharan clicks 😍#RamCharan #ManOfMassesRamCharan pic.twitter.com/AVVqhrAzD5
— Charankonidela (@Charankonidela1) July 7, 2022