సినిమా ఇండస్ట్రీలో నటీనటుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. సినిమా అవకాశాలు వస్తే ఊపిరి సలపనివ్వంతగా వస్తాయి. రాకపోతే మొత్తానికి రావు. అందుకే వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా చేస్తుంటారు ప్రతీ ఆర్టిస్టు. ఆల్రెడీ ఒక సినిమా ఆఫర్ ఉంది కదా అని, వేరే సినిమా చేయకపోతే.. ఖాళీ అయిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకే ఆర్టిస్టులు ఏ అవకాశం వచ్చినా వదులుకోరు. ఈ క్రమంలో తినడానికి కూడా సమయం ఉండదు. తెలుగులో బ్రహ్మానందం, అలీ లాంటి హాస్యనటులు అయితే ఒకే రోజు నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటారు. స్వర్గస్తులైన కమెడియన్ వేణుమాధవ్ కైతే తినడానికి టైం కూడా ఉండేది కాదు. ఒకేరోజు నాలుగైదు సినిమాల షూటింగుల్లో పాల్గొనేవారు.
ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ కి వెళ్లే గ్యాప్ లో కారులో లంచ్ చేసేవారు. అంతలా కష్టపడేవారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతను ఆర్టిస్టులు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే అని సినీ పెద్దలు చెబుతుంటారు. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే వరుస అవకాశాలు దక్కించుకుని, డబ్బులు సంపాదించినా ఆరోగ్యాన్ని కాపాడుకోలేని పరిస్థితి. అలా అని అస్సలు అవకాశాలు లేక డబ్బులు సంపాదించుకోలేకపోయినా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోలేని పరిస్థితి. ఏదైనా మితంగా ఉండాలని అందుకే అనేది పెద్దలు. బిజీగా ఉన్నవారు, అవకాశాలు లేని వారు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం, మరీ ముఖ్యంగా ఆరోగ్యం క్షీణించినప్పుడు కాపాడుకోవడం చాలా కష్టంగా ఉంటుంది.
ఎవరైనా సాయం చేస్తే తప్ప వారు ప్రాణాలతో బయట పడలేరు. సినిమా ఇండస్ట్రీలో నటీనటుల పరిస్థితి ఎప్పుడూ ఇంతే ఘోరంగానే ఉంటుంది. ఇప్పుడు జనరేషన్ ఆర్టిస్టుల ఆలోచనా విధానం వేరు. ఒకప్పుడు ఆర్టిస్టులు సినిమా తప్ప వేరే వ్యాపకం ఉండేది కాదు. అందుకే సినిమాలే ప్రాణంగా భావించేవారు. ఈ క్రమంలో ఆరోగ్యం మీద అంతగా దృష్టి పెట్టేవారు కాదు. మద్యం అలవాటు ఉండడమో, వేళకి భోజనం చేయకపోవడమో ఇలా రకరకాల కారణాల వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఇలా చాలా మంది నటులు, ముఖ్యంగా హాస్యనటులు సినిమాల్లో పడి ఆరోగ్యం ఏమైపోతుందన్న విషయాన్ని కూడా పట్టించుకోరు. తాజాగా ప్రముఖ హాస్యనటుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం చాలా విషమంగా ఉంది. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడే వెల్లడించారు. తన స్నేహితుడు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడని వెక్కి వెక్కి ఏడ్చారు.
వివరాల్లోకి వెళ్తే.. కోలీవుడ్ కి చెందిన హాస్యనటుడు బోండామణి.. తన రెండు కిడ్నీలు దెబ్బ తినడంతో చెన్నైలోని ఓమందూర్ హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన సహనటుడైన బెంజిమన్ వీడియో ద్వారా వెల్లడించారు. శ్రీలంకకు చెందిన బోండామణి కొన్నేళ్ల క్రితమే బతుకుతెరువు కోసం చెన్నై వచ్చారు. అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరుగుతూ.. 1991లో కె.భాగ్యరాజ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన పవుణు పవుణుదాన్ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసి.. ఆ తర్వాత సుందర్ ట్రావెల్స్, మరుదమలై, విన్నర్, వేలాయుధం, జిల్లా వంటి సినిమాల్లో నటించి హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
நடிகர் சங்கம் சார்பில் போண்டாமணியை சந்தித்து நிதி உதவி வழங்கிய மனோபாலா..#BondaMani https://t.co/r7KtByPqxZ
— News18 Tamil Nadu (@News18TamilNadu) September 22, 2022
2019లో వచ్చిన తనిమై సినిమా తర్వాత ఈయన ఏ సినిమాల్లోనూ నటించలేదు. ఈ ఏడాది మే నెలలో గుండె సంబంధిత సమస్యతో ఆయన చెన్నై,ఓమందూర్ హాస్పిటల్ లో చేరారు. మూడు నెలలకు పైగా ఎమర్జన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ విషయం తెలుసుకున్న సహనటుడు బెంజిమన్.. “తన స్నేహితుడి రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయని, తన స్నేహితుడు ప్రాణాలతో పోరాడుతున్నాడని, ట్రీట్ మెంట్ కోసం చేతనైన సాయం చేయండి” అంటూ కోరుతూ ఏడుస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాస్యనటుడికి సాయం చేయాలని కోరుతూ వీడియోని షేర్ చేస్తున్నారు నెటిజన్లు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.