సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎందరో హీరోయిన్స్ వస్తుంటారు పోతుంటారు. వారిలో కొందరు స్టార్డమ్ అందుకొని సెటిల్ అయిపోతారు. మరికొందరు ఎంత వేగంగా క్రేజ్ దక్కించుకుంటారో, అంతే వేగంగా ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. ఆ విధంగా తెలుగు ఇండస్ట్రీలో డెబ్యూ మూవీతోనే సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్. ‘కొత్త బంగారు లోకం’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్వేతా.. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. కానీ.. ఎందుకో మరి సినిమాల ఎంపిక సరిగ్గా లేకనో, అవకాశాలు రాకనో పెద్దగా తన మార్క్ క్రియేట్ చేసుకోలేకపోయింది. డెబ్యూ చేసిన మూడేళ్లకే తెలుగులో ఐటమ్ సాంగ్స్ చేసే స్థితికి చేరుకుంది.
బీహార్ కి చెందిన శ్వేతా మొదట హిందీ సినిమాలు, సీరియల్స్ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ తెలుగులో అడుగుపెట్టింది. 2008లో కొత్త బంగారులోకం మూవీ చేసిన శ్వేతా.. లీడ్ హీరోయిన్ గా 2010లో ‘కలవర్ కింగ్’ మూవీ చివరిగా చేసింది. అంటే కనీసం రెండేళ్లు కూడా శ్వేతా హీరోయిన్ గా కంటిన్యూ అవ్వలేకపోవడం గమనార్హం. ఆ తర్వాత అవకాశాలు లేకపోయేసరికి మెల్లగా ఐటమ్ సాంగ్స్ లో మెరిసింది. అనంతరం 2014 నుండి పూర్తిగా బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లపై ఫోకస్ పెడుతోంది. తాజాగా శ్వేతా.. ‘గుణేగార్’ అనే టెలి సిరీస్ లో నటిస్తోంది.
ఈ క్రమంలో గునేగార్ సిరీస్ రిలీజ్ కి దగ్గరపడటంతో శ్వేతా ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటుంది. ఇక ప్రమోషన్స్ లో పాల్గొన్న శ్వేతాను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే.. కొత్త బంగారు లోకం మూవీలో ఎంతో క్యూట్ గా కనిపించిన శ్వేతా.. 31 ఏళ్లకే బాగా ముదురు ముఖంతో కనిపించేసరికి ఇంతలా మారిపోయిందా అని ముక్కున వేలేసుకుంటున్నారు ఫ్యాన్స్, నెటిజన్స్. అయితే.. శ్వేతా హీరోయిన్ గా కెరీర్ డౌన్ లో ఉన్నప్పుడే రోహిత్ మిట్టల్ అనే ఫిలిం మేకర్ ని పెళ్లి చేసుకుంది. కానీ.. పెళ్ళైన ఏడాదికే ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం శ్వేతా అవకాశాలను బట్టి సినిమాలు, సిరీస్ లు చేసుకుంటూ పోతుంది. మరి శ్వేతా బసు ప్రసాద్ ప్రెజెంట్ లుక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.