బాలీవుడ్ యువనటి తునిషా శర్మ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తునీషా తల్లి ఫిర్యాదు మేరకు ఆమె సహనటుడు షీజన్ మహమ్మద్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను ఆత్మహత్యకు ప్రేరిపించినట్లు అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కొన్నాళ్ల క్రితం వరకు వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉండగా.. ఇటీవల బ్రేకప్ అయినట్లు సమాచారం. తునీషా శర్మ తరచుగా షీజన్ ఖాన్‌తో ఉన్న ఫోటోలను ఎక్కువగా షేర్ చేసేవారు. ఇవాళ ఉదయం ముంబైలోని జేజే ఆస్పత్రిలో తునీషా డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
షూటింగ్ స్పాట్ లోనే తునిషా శర్మ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ‘అలీబాబా: దాస్తాన్ ఈ కాబుల్’ షూటింగ్ లో పాల్గొన్న ఆమె మేకప్ రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చోటు చేసుకొన్న సమయంలో సెట్‌లో ఉన్న సిబ్బందిని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. హత్య, ఆత్మహత్య.. రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ చంద్రకాంత్ జాదవ్ పేర్కొన్నారు. ఘటనా స్థలంలో తమకు ఎటువంటి ఆత్మహత్య లేఖ లభించలేదని వెల్లడించారు. షీజన్ మహమ్మద్ ఖాన్‌ను రేపు వసాయి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
‘The most beautiful man in my life…’ This was Tunisha Sharma’s last post for Sheezan Mohammed Khan pic.twitter.com/LWZV724gf8
— Times No1 (@no1_times) December 25, 2022
తునిషా 13 ఏళ్ల వయసులో ‘భారత్ క వీర్ పుత్ర మహారాణా ప్రతాప్’ సీనియల్‌లో తొలిసారి నటించింది. అలా బాలనటిగా కెరీర్ మొదలుపెట్టిన తునిషా శర్మ పలు చిత్రాల్లో కూడా నటించింది. కత్రినా కైఫ్, విద్యాబాలన్ వంటి స్టార్లతో కలిసి పనిచేసింది. ‘చక్రవర్తి అశోక సామ్రాట్’, ‘గబ్బర్ పూన్చావాలా’, ‘ఇంటర్నెట్ వాలాలవ్’, ‘హీరో: గాయబ్ మోడ్ ఆన్’ తదితర సీరియళ్లలో నటించి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. వెండితెరపైనా సందడి చేసింది. ‘ఫితూర్’ సినిమాలో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ చిన్నప్పటి పాత్ర పోషించింది.
Exclusive! Late actress Tunisha Sharma’s rumored boyfriend Sheezan Mohammed Khan detained by police for interrogation !#tunishasharma #tunishasharmafanpage #tunisha #tunishasharma💋 #tellywood #sheezankhan #sheezanmohammed #sheezanmohammad #tellycelebs #telly #sad #demise #rip pic.twitter.com/YnY76jUNzj
— BKBShorts (@BkbShorts) December 24, 2022