తెలుగు ప్రేక్షలను ఎంతగానే ఆకట్టుకుంటున్న షో జబర్ధస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్ట్ లకి మంచి గుర్తింపు వచ్చింది. వీరిలో కొందరు వెండి తెరపై కూడా మెరిశారు. అలాంటి కమెడియన్ లలో హైపర్ ఆది ఒకరు. పంచ్ ల స్పెషలిస్టుగా పేరొందిన ఆది టాలెంట్ గురించి అందరికి తెలిసిందే. ఇక జబర్ధస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో వ్యక్తి సుడిగాలి సుధీర్. ఇప్పుడు సుధీర్ హీరో కూడా. అయితే.., మంచి స్నేహితులైన వీరిద్దరి మధ్య ఇప్పుడు ఓ స్కిట్ లేనిపోని రచ్చకి కారణం అయ్యిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
యూట్యూబ్లో హైపర్ ఆది, సుధీర్ స్కిట్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ ఉంటుంది. వీరిద్దరు స్కిట్లకు పోటాపోటీగా వ్యూస్ వస్తుంటాయి. ఇక తాజాగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ ఇద్దరు కూడా ‘పుష్ప‘ మూవీ స్ఫూఫ్ ని స్కిట్ గా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ స్కిట్ విషయంలోనే ఆది, సుధీర్ ఫ్యాన్స్ మధ్య కామెంట్స్ వార్ షురూ అయ్యింది. ముందుగా సుధీర్ చేసిన పుష్ప స్కిట్ 10 మిలియన్లు వ్యూస్ ను రాబట్టింది. దీంతో.. తమ సుధీర్ అన్నకి తిరుగులేదు అంటూ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. కానీ.. తరువాత రెండు రోజుల్లో హైపర్ ఆది పుష్ప స్కిట్ కి వ్యూస్ అమాంతం పెరిగిపోయాయి.
సుధీర్ చేసిన స్కిట్ కి 8 రోజులకు 10 మిలియన్ వ్యూస్ రాగా.., హైపర్ ఆది స్కిట్ మాత్రం 9 రోజుల్లోనే 13 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది. వీళ్లిద్దరి మధ్య ఏకంగా 30 లక్షల వ్యూస్ తేడా రావడంతో హైపర్ ఆది ఫ్యాన్స్ సుధీర్ ని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. దీంతో.. ఇప్పుడు ఈ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య ఓ రేంజ్ రచ్చ నడుస్తోంది. బయట ఇంతటి గొడవ జరుగుతున్నా సుధీర్ గాని, ఆది గాని ఈ విషయంలో స్పందించకపోవడం విశేషం. మరి.. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ పుష్ప స్కిట్స్ లో మీకు ఎవరి స్కిట్ నచ్చింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.