మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని, ఆయన్ని డైరెక్ట్ చేయాలని ఎంతో మంది దర్శకులు ఎదురుచూస్తుంటారు. అలా ఎదురు చూసిన వారిలో పూరీ జగన్నాథ్ ఒకరు. అలానే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కూడా హీరోగా చేయాలని చాలా మంది హీరోలు అనుకుంటారు. హీరోలని కొత్తగా, విభిన్నంగా చూపించడంలో పూరీ శైలే వేరు. పూరీ సినిమాలంటే హీరోల మ్యానరిజం జనాల మైండ్ లో ప్రింట్ దిగిపోద్ది. అంతలా పూరీ సరికొత్త మ్యానరిజంతో సినిమాని లాక్కెళ్లిపోతారు. బద్రి, ఇడియట్, శివమణి, పోకిరి, బిజినెస్ మేన్, టెంపర్ ఇలా ఆయా హీరోల మ్యానరిజం ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది. అయితే చిరంజీవి లాంటి ఆల్ రౌండర్, మాస్ హీరో.. పూరీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తే చూడాలని చాలా మంది కోరుకున్నారు.
అప్పట్లో వీరి కాంబినేషన్ లో ఒక సినిమా కూడా సెట్ అయ్యింది. మెగాస్టార్ రీ ఎంట్రీ కోసం 150వ సినిమాగా పూరీ జగన్నాథ్ సినిమానే రావాల్సి ఉంది. దీని కోసం ఆటో జానీ అనే మాస్ మసాలా సినిమా స్క్రిప్ట్ ని రెడీ చేశారు పూరీ జగన్నాథ్. అయితే ఫస్ట్ హాఫ్ అంతా బానే ఉంది, సెకండ్ హాఫ్ మార్చమని పూరీకి చెప్పారు చిరంజీవి. ఆ తర్వాత మళ్ళీ దీని గురించి ఎటువంటి అప్ డేట్ లేదు. దీంతో పూరీ, చిరు కాంబినేషన్ లో ప్రాజెక్ట్ ఆగిపోయినట్టే అనుకున్నారు. ఇక పూరీ కూడా తన మార్కు డైరెక్షన్ ని చూపించడంలో వరుసగా ఫెయిల్ అవుతున్నారు. పడుతున్నారు, లేస్తున్నారు, మళ్ళీ పడుతున్నారు. వరుస ప్లాపులతో సతమతమవుతున్న పూరీ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ లేచారు. లైగర్ సినిమాతో ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకున్నారు.
దీంతో పూరీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పూరీ, మెగాస్టార్ ని కలిసినట్టు వార్తలు వస్తున్నాయి. చిరంజీవిని కలిసి సినిమా ప్రపోజల్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. చిరంజీవి కూడా సానుకూలంగా స్పందించడంతో పూరీ కథ రెడీ చేసుకునే పనిలో ఉన్నట్లు టాక్. మరి అది ఆటో జానీ స్క్రిప్ట్ ఆ లేక కొత్త కథ అని తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తుండగా.. చిరు నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కాబోతుంది.
బిల్లా తప్ప మెహర్ రమేష్ కెరీర్ లో చెప్పుకోతగ్గ సినిమా లేదు. అయినా గానీ చిరు మెహర్ రమేష్ కి అవకాశం ఇచ్చారు. ఇక అనేక బ్లాక్ బస్టర్స్ కి కేరాఫ్ అడ్రస్ అయిన పూరీ జగన్నాథ్ కి కూడా అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ఇది నిజమైతే గనుక పూరీ కల నెరవేరినట్టే. ఈ కాంబినేషన్ కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు మామూలు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడిస్తారో చూడాలి.