దేశాన్ని ఏలే రాజైనా సరే.. తల్లికి మాత్రం కొడుకే. బిడ్డలు జీవితంలో ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించినా సరే.. తల్లి దగ్గరకు వచ్చే సరికి వాటన్నింటిని పక్కకు పెట్టి.. స్వచ్ఛమైన అమ్మ ప్రేమలో మురిసిపోతారు. తల్లి ప్రేమలోని గొప్పదనం అలాంటిది. ఎంత గొప్ప సెలబ్రిటీ అయినా సరే.. తల్లి ప్రేమకు దాసుడు. తాను కూడా తల్లి ప్రేమకు దాసుడునే అంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. కొన్ని కోట్ల మంది తనను ప్రేమించి.. ఆరాధిస్తే.. తాను మాత్రం.. తన తల్లి ప్రేమకు దాసుడినంటూ ప్రకటించారు చిరంజీవి. జనవరి 29 చిరంజీవి కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన రోజు. చిరంజీవి తల్లి అంజనాదేవి పుట్టిన రోజు. ఎన్ని పనులున్నా సరే.. పుట్టిన రోజు నాడు తల్లితో ఉంటాడు చిరంజీవి. ఆమెతో కేక్ కట్ చేయించి.. పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తాడు. ఈ ఏడాది కూడా అలానే చేశాడు చిరంజీవి.
తల్లి అంజనా దేవి పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫొటోలను.. చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘‘మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ పుట్టినరోజు. జన్మజన్మలు నీకు బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్‌డే అమ్మ’’ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు చిరంజీవి. ప్రస్తుతం ఈ ఫోటో వైరలవుతోంది. అంజనాదేవి ఐదుగురు బిడ్డలు ఇలా ఒకే ఫోటోలో కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఫోటోలో అంజనా దేవి ముగ్గురు కొడుకులు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌తో పాటు కుమార్తెలు విజయదుర్గ, మాధవిలు ఉన్నారు. పిల్లల సమక్షంలో పుట్టినరోజును జరుపుకున్నారు. ఇక నానమ్మ అంజనా దేవి పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు కూడా పాల్గొన్నారు. నానమ్మకు బర్త్‌డే విషేస్ చెబుతూ.. ఆమెను ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్నాడు రామ్ చరణ్. ఉపాసన కూడా అంజనా దేవికి బర్త్‌డే విషేస్ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.