సంక్రాంతి అంటే టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలు సందడి చేస్తాయి. స్టార్ హీరోలు మొదలు.. చిన్న హీరోలు ఇలా ప్రతి ఒక్కరు సంక్రాంతి బరిలో నిలవాలని ఆశపడతారు. అలానే ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాలతో బరిలో దిగారు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో.. బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాయి. ఈ క్రమంలో హీరోలతో పాటు వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీ, వీర సింహా రెడ్డి డైరెక్టర్ గోపీచంద్ తమ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వీర సింహారెడ్డి దర్శకుడు మలినేని గోపీచంద్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. మెగాస్టార్ తనకు గిఫ్ట్ ఇచ్చారంటూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. ఎందుకు.. ఎప్పుడు అంటే..
రీసెంట్ ఇంటర్వ్యూలో గోపీచంద్ మలినేని చిరంజీవి తనకు గిప్ట్ ఇచ్చిన సందర్భం గురించి మాట్లాడుతూ ‘‘సాధారణంగా నాకు రవితేజగారి పోలికలుంటాయి. సజెషన్ షాట్స్ వస్తే.. రవితేజ గారు అయితే.. ‘‘నేను వెళతున్నాను.. అబ్బాయ్ నువ్వు నిలుచో’’ అని చెప్పేసి ఆయన వెళ్లిపోయేవారు. అలానే మెగాస్టార్ చిరంజీవిగారైతే బక్క రవితేజను పిలవండి అనేవారు. ఇలా ఉండగా.. ఓసారి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నప్పుడు నా పుట్టిన రోజు వచ్చింది. ఆ విషయం కాస్త చిరంజీవిగారికి తెలిసింది. వెంటనే ఆయన, అరవింద్‌గారు సెట్స్‌కు వచ్చారు. చిరంజీవిగారు ఓ వాచ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు. వాచ్ నా చేతికి అందిస్తూ.. ఈరోజు నుంచి నీ టైమ్ బావుంటుంది అని చెప్పారు’’ అని గుర్తు చేసుకున్నాడు గోపీచంద్ మలినేని.
రవితేజ డాన్ శీను సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ మలినేని.. బాడీ గార్డ్, బలుపు, పండగ చేస్కో, విన్నర్, క్రాక్.. ఇక తాజాగా బాలకృష్ణతో వీర సింహా రెడ్డి సినిమా.. ఇలా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. ఇక గోపీచంద్ కెరీర్లో విన్నర్ సినిమా తప్పితే.. మిగతా సినిమాలు అన్ని హిట్, సూపర్ హిట్ సాధించాయి. ఇక వీర సింహారెడ్డి సినిమా అయితే మాసివ్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. అయితే వీర సింహారెడ్డి సినిమాకు తప్ప.. మిగతా ఏ సినిమాకు తనకు ఫుల్ రెమ్యూనరేషన్ ఇవ్వలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు గోపీచంద్ మలినేని. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.