తమ్ముడు పవర్ స్టార్ కు వీరాభిమానిగా అన్న మెగాస్టార్.. వింటుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి కదా. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ ట్రెండ్ అవుతుంది. ఇందులో నిజమెంత?
అవును.. మీరు చూస్తున్నది, చదువుతుంది నిజమే. మెగాస్టార్ చిరంజీవి గురించి మేం చెప్పడం, మీరు వినడం చాలా కామన్ అయిపోయింది. అయినాసరే మరోసారి చెప్పుకుందాం. అన్ని రకాల పాత్రల్లో యాక్ట్ చేసిన చిరు.. యాక్షన్, రొమాన్స్, ఎంటర్ టైన్ మెంట్ ఇలా దాదాపు అన్ని జానర్స్ ని కవర్ చేసేశారు. ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దాలు దాటిపోయినా సరే ఇప్పటికీ కుర్రహీరోల కష్టపడుతూనే ఉన్నారు. దానికి ఫలితమే సంక్రాంతికి దక్కిన ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో ఫుల్ జోష్ లోకి వచ్చేసిన చిరు.. కొత్త సినిమాలని రెడీ చేస్తున్నారు.
ఇక విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి ఇంటినుంచి చాలామంది హీరోలు ఉన్నారు. చిరు తర్వాత పవన్ కల్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. సక్సెస్ ఫెయిల్యూర్స్ పక్కనబెడితే.. తెలుగు రాష్ట్రాల్లో అశేషమైన క్రేజ్ సంపాదించుకున్నారు. కుర్రాళ్లలో ఎవరిని అడిగినా సరే 10లో 8 మంది అయినా సరే PSPK ఫ్యాన్స్ కచ్చితంగా ఉంటారు. అది ఆయన రేంజ్. ప్రస్తుతం ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు పాలిటిక్స్ లో పవన్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ఏంటంటే.. చిరు తన కొత్త సినిమాలో ఏకంగా పవన్ కల్యాణ్ అభిమానిగా కనిపించనున్నారట.
సెకండ్ ఇన్నింగ్స్ ని ‘ఖైదీ నంబర్ 150’తో గ్రాండ్ గా స్టార్ చేసిన చిరు ఆ తర్వాత ‘సైరా’, ‘ఆచార్య’ చేశారు. ఒకటి మిక్స్ డ్ టాక్ తెచ్చుకోగా, మరొకటి ఘోరంగా ఫెయిలైంది. గతేడాది ‘గాడ్ ఫాదర్’తో ట్రాక్ లోకి వచ్చేసిన మెగాస్టార్.. రీసెంట్ గా సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా దాదాపు రూ.200 కోట్ల వసూళ్లు సాధించారు. నెక్స్ట్.. మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ చేస్తున్నారు. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తీస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతోంది. రీసెంట్ గా ఓ కలర్ ఫుల్ సాంగ్ ని పూర్తిచేశారు. అయితే ఇదే మూవీలో PSPK ఫ్యాన్ గా చిరు కనిపిస్తారని తెలుస్తోంది. అయితే కొన్ని సీన్స్ కోసమా? లేదా మూవీ అంతా అనేది తెలియాల్సి ఉంది. ఈ వార్త నిజం కావాలని గట్టిగా కోరుకుందాం. ఒకవేళ అదే జరిగితే మాత్రం మెగా ఫ్యాన్స్ కు పండగే. ఇది నిజం కావాలనుకునేవాళ్లు కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
Megastar as #PSPK fan?
— idlebrain jeevi (@idlebrainjeevi) February 20, 2023