ఉత్తమ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ విభాగంలో భారత్ తరఫున ఆస్కార్-2023 బరిలో నిలిచిన గజరాతి చిత్రం ఛెల్లో షో. ఇంగ్లీష్ లో (లాస్ట్ ఫిల్మ్ షో) ఈ మూవీ విడుదలైంది. డైరెక్టర్ నలిన్ బాల్య జ్ఞాపకాల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో భవిన్ రాబారి, భవేష్ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్ రావల్, పరేష్ మెహతా తదితరుల నటించి మెప్పించారు. గుజరాత్ లోని ఓ మారు పల్లెటూరులో జరిగిన కథతో రూపొందించిన ఈ మూవీ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకోవడం విశేషం.
సినిమాల పట్ల ఎంతో మక్కువతో ఉన్న ఓ తొమ్మిదేళ్ల అబ్బాయి సామీ ( భవిన్ రాబరీ) తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇకపోతే స్పెయిన్ లో జరిగిన వల్లాడోలిడ్ చిత్రత్సవంలో ఈ మూవీ గోల్డెన్ స్పైక్ పురస్కారంతో పాటు మరెన్నో అంతర్జాతీయ పురస్కారాలను సైతం అందుకోవడం గమనార్హం. ఇలా ఎన్నో అవార్డులను దక్కించుకున్న ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంద అని ప్రేక్షకులు ఎప్పటి నుంచి ఎదురు చూశారు. ఇక ప్రేక్షకుల కోరికలను నిజం చేస్తూ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తాజాగా అధికారికంగా తెలిపింది.
నవంబర్ 25 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఛెల్లో షో మూవీ ప్రసారం కానుందని తెలిపింది. ఇక దీనిపై స్పందించాడు ఈ మూవీ డైరెక్టర్ నలిన్. లాస్ట్ ఫిల్మ్ షో అనేది సినిమా కాదని, ఇది ఒక వేడుక అంటూ తెలిపారు. ఇక ఆ వేడుకను ఇప్పుడు భారత్ లోని ప్రజలందరూ చేసుకోనున్నారని దర్శకుడు నలిన్ తెలిపారు. ఆస్కార్ బరిలో నిలిచిన ఛెల్లో షో మూవీని ఓటీటీలో చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాల్లో బాల నటుల్లో ఒకరైన రాహుల్ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే.
Last Film Show — India’s official entry to #Oscars will premiere on NETFLIX November 25th. pic.twitter.com/8tnh9DEYfF
— LetsCinema (@letscinema) November 21, 2022