పూరి జగన్నాథ్, ఛార్మీల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొంత కాలంగా లైగర్ సినిమా కోసం ముంబైలోనే వీరు ఉంటున్న సంగతి తెలిసిందే. మధ్యలో కరోనా కారణంగా లాక్ డౌన్ రావడంతో పూర్తిగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. డ్రగ్స్ కేసుల వ్యవహారంలో ఈడీ పిలిచిందని మధ్యలో పూరీ, ఛార్మీలు హైద్రాదబాద్ కు వచ్చారు. ఈ క్రమంలో నటుడు ఆలీ తన భార్య జుబేదాతో కలిసి ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ పూరీ, ఛార్మీలకు ఆలీ భార్య స్పెషల్ వంట చేసి.. వారిని ఫిదా చేసింది. ఆలీకి, పూరికి మధ్య ఎంతో మంచి స్నేహ బంధం ఉంది. పూరి సినిమాలు అంటే ఆలీకి ప్రత్యేక పాత్రలుంటాయి. ఇక ఆలీ గురించి పూరి పలు వేదికల్లో ఎంతో గొప్పగా మాట్లాడాడు.
యూట్యూబ్ ద్వారా వంటల వీడియోలు, హోం టూర్ వీడియోలంటూ చేస్తూ జుబేదా ఆలీ అందరికి సుపరిచతమైన విషయం తెలిసిందే. అలా ఆమెకి నెట్టింట్లో చాలానే మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇప్పుడు పూరి, ఛార్మీలకు జుబేదా స్పెషల్‌గా వంట చేసి వడ్డించినట్టుంది. ఇదే విషయాన్ని ఛార్మీ చెప్పుకొచ్చింది. “మా దగ్గరకు వచ్చారు.. ఎంతో ప్రేమతో వంట చేసి వడ్డించావ్.. థ్యాంక్స్” అంటూ జుబేదా గురించి ఛార్మీ చెప్పుకొచ్చింది. ఛార్మీ పోస్ట్ కు “థ్యాంక్యూ సో మచ్ డార్లింగ్” అంటూ ఛార్మీకి జుబేద రిప్లై ఇచ్చింది. మరి.. వీరిద్దరి ఆసక్తికరమైన పోస్ట్ లపై మీ అభిప్రాయాలను కామెట్స్ రూపంలో తెలియజేయండి.