సోషల్ మీడియాలో గ్లామరస్ పిక్స్ పెట్టడం, ముఖ్యంగా బికినీలో ఫోటోలు షేర్ చేసి అభిమానుల అటెన్షన్ ను డ్రా చేయడం అనేది హీరోయిన్స్ కి వెన్నతో పెట్టిన విద్య. ఈ క్రమంలో బాలయ్యతో కలిసి నటించిన, నర్తించిన బ్యూటీ బీచ్ ఒడ్డున బికినీలో ఫోజులిస్తూ హాట్ లుక్ లో దర్శనమిచ్చింది.
సోషల్ మీడియాలో గ్లామరస్ పిక్స్ పెట్టడం, ముఖ్యంగా బికినీలో ఫోటోలు షేర్ చేసి అభిమానుల అటెన్షన్ ను డ్రా చేయడం అనేది హీరోయిన్స్ కి వెన్నతో పెట్టిన విద్య. అలా గ్లామరస్ ఫోటోలు, బికినీ ఫోటోలు పెట్టకపోతే జనం మర్చిపోతారన్న భయమో, మరేంటో తెలియదు గానీ హాట్ హాట్ ఫోటోలు పెట్టి కవ్వించడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ క్రమంలో బాలయ్యతో కలిసి నటించిన, నర్తించిన బ్యూటీ బీచ్ ఒడ్డున బికినీలో ఫోజులిస్తూ హాట్ లుక్ లో దర్శనమిచ్చింది. చంద్రిక రవి భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ నటి, మోడల్, డ్యాన్సర్. హర్రర్ సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన చంద్రిక రవి.. తెలుగులో చీకటి గదిలో చితక్కొట్టుడు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఐటం సాంగ్ చేసింది.
ఆ తర్వాత బాలయ్య సరసన వీరసింహారెడ్డి సినిమాలో ఒక పాటలో నర్తించింది. మా బావ మనోభావాలు పాటలో బాలయ్యతో కలిసి చిందులేసింది. ఈ పాటతో తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసింది. ఈ ఒక్క పాటతో తనకంటూ సెపరేట్ మాస్ ఫాలోయింగ్ ని సెట్ చేసుకుంది. ఆట, పాటతోనే కాదు.. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో కూడా షేక్ ఆడిస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటోలు పెడుతూ నెటిజన్స్ కి మంచి ట్రీట్ ఇస్తుంటుంది. ఈమెకు ఫాలోవర్స్ కూడా ఎక్కువే. ఫోటోలు అప్లోడ్ చేస్తే క్షణాల్లో వైరల్ అయిపోతుంటాయి. బికినీలో ఫోటోలు దిగుతూ జనాన్ని గ్లామరస సాగరంలో ముంచెత్తుతోంది.
తాజాగా అమ్మడు ఇండోనేషియా ట్రిప్ ని ఎంజాయ్ చేస్తోంది. బలి అనే ఐలాండ్ లో బీచ్ ఒడ్డున సేద తీరిన ఫోటోలను తన ఇన్స్టా ఖాతాలో అప్లోడ్ చేసింది. టూపీస్ బికినీలో కనబడుతూ చెమటలు పట్టిస్తోంది. కొబ్బరి చెట్టుకు ఆనుకుని.. చేతిలో వైన్ సీసానో, బీర్ సీసానో పోలిన సీసాను చేతిలో పట్టుకుని తాగుతోంది. చూస్తుంటే ఏ వైనో, బీరో తాగుతోంది అనుకుంటారు. కానీ నిజానికి అది మందు కాదు, మంచి నీరు. అమ్మడు మంచి నీరు తాగుతుంటే.. అది తెలియక నెటిజన్స్ మందు తాగుతున్నావా అంటూ మండిపడుతున్నారు. కొంతమంది మాత్రం అది మందు కాదురా.. మంచి నీళ్ళేరా అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బికినీలో ఇలా బీచ్ ఒడ్డున మందు కొడుతున్నట్టు ఫోజులిచ్చిన ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.