ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువయిపోయాయి. సామాన్య జనం నుంచి సినీ సెలెబ్రిటీల వరకు వివాహేతర సంబంధాలతో తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం ఓ సినిమా డైరెక్టర్ తన ప్రియురాలితో కారులో కలిసి తిరుగుతూ భార్యకు అడ్డంగా దొరికి పోయాడు. తాజాగా, ఓ సినీ నిర్మాత మరో మహిళతో తిరుగుతూ భార్యకు అడ్డంగా దొరికిపోయాడు. ఇద్దరూ కారులో ఉండగా నిర్మాత భార్య వారిని చూసింది. ఈ నేపథ్యంలోనే కారు దగ్గరకు వెళ్లిన ఆమెపైకి నిర్మాత కారును పోనిచ్చాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కమల్ కిశోర్ మిశ్రా వేరే మహిళతో ఇంటి బయట ఉన్న కారులో ఉన్నారు. భర్త కోసం వెతుకుతూ ఆయన భార్య ఇంటి బయటకు వచ్చింది. కారులో ఉన్న వాళ్లను చూసింది. భర్త వేరే మహిళతో ఉండటం ఆమెకు నచ్చలేదు. ఈ విషయమై నిలదీయటానికి కారు దగ్గరకు వెళ్లింది. అయితే, భార్య కారు దగ్గరకు రావటంతో కమల్ కిశోర్ భయపడిపోయాడు. భార్య కారు బోనెట్‌ను పట్టుకుని భర్తను కిందకు దిగమని అడిగింది. అతడు దిగలేదు. దీంతో ఆమె గట్టిగా అరుస్తూ కారు బోనెట్‌పై కొట్టసాగింది.
భార్య అలా గట్టిగా అరుస్తుండటంతో కమల్ కిశోర్ కారును ముందుకు పరుగులు పెట్టించాడు. దీంతో కారు ఆమెను ఢీకొట్టి దూసుకెళ్లిపోయింది. వేరే వ్యక్తి ఆమెను రక్షించాడు. కారు ఢీకొట్టడం కారణంగా ఆమెకు గాయాలయ్యాయి. కమల్ కిశోర్ తనను కారుతో ఢీకొట్టాడంటూ ఆయన భార్య బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కారు ఢీకొట్టడం వల్ల తన తలకు గాయాలయ్యాయని పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.