మండపంలో పెళ్లి తంతు జరుగుతుంటుంది. బంధువులు, స్నేహితులతో వేదిక అంతా హడావిడాగా ఉంటుంది. పెళ్లి వారు బిజీబిజీగా ఉంటారు. పురోహితుడు మంత్రాలు చదువుతుంటాడు. ఇంతలో అందరికి షాక్ ఇచ్చేలా ఓ వాయిస్.. ఈ పెళ్లి ఆపండి.. ఆ వెంటనే ఒక్కొక్కరి ముఖాలు క్లోజప్‌లో చూపిస్తూ.. రకరకాల ఎక్స్‌ప్రెషన్స్ పండిస్తారు. ఆ తర్వాత పెళ్లి కొడుకును అరెస్ట్ చేయడమో.. అతడికి ఆల్రెడీ పెళ్లి అయ్యిందని తెలియడమో జరుగుతుంది. ఈ సీన్ అనాదిగా మన సినిమాలు, సీరియల్స్‌లో రిపీట్ అవుతూ వస్తోంది. ఈ మధ్య కాలంలో కొన్ని చోట్ల రియల్‌గా కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. సామాన్యుల పెళ్లిలో ఇలాంటి సీన్ రిపీట్ అయితే ఏమో కానీ.. సెలబ్రిటీల వివాహ వేడుకలో కూడా ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకుంటే.. ఇదిగో ఇలా ఉంటుంది.
ఇంటర్నేషనల్ పాప్ స్టార్ బ్రిట్ని స్పియర్స్ పెళ్లిలో ఇలాగే జరిగింది. బ్రిట్ని స్పియర్స్ చాలా ఆటంకాల తర్వాత పెళ్లి చేసుకుంటోంది. బ్రిట్ని స్పియర్స్‌కు ఇప్పటి వరకూ ఎదురైన ఇబ్బందుల కారణంగా రహస్యంగా పెళ్లి చేసుకుంటోంది. లాస్ ఏంజెల్స్‌లో జరుగుతున్న ఈ పెళ్లికి ఇబ్బందులు తప్పలేదు. పెళ్లి జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి… హంగామా సృష్టించాడు. బ్రిట్ని స్పియర్స్ తన భార్య అని.. తనకు ఉన్న ఒకే ఒక్కభార్య అని.. వేడుకున్నాడు. పెళ్లిని ఆపాలని కోరాడు. అయితే ఇలాంటిదేదో జరుగుతుందన్న కారణంగానే ముందస్తుగా భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు ఆ యువకుడ్ని పెడరెక్కలు విరిచి కట్టి తీసుకెళ్లిపోయారు.
ఇది కూడా చదవండి: Sai Pallavi: సాయిపల్లవికి చాక్లెట్ ఇచ్చిన RK.. వైరల్ అవుతున్న వీడియో!
బ్రిట్ని స్పియర్స్ పెళ్లిని ఆపడానికి ప్రయత్నించిన ఆ వ్యక్తి పేరు జేసన్ అలెగ్జాండర్. నిజంగానే బ్రిట్ని స్పియర్స్‌ను పెళ్లాడాడు. 2004లో జేసన్ అలెగ్జాండర్‌ను బ్రిట్నీ పెళ్లాడింది. కానీ ఆ జంట కేవలం 55 గంటలు మాత్రమే కలిసి ఉన్నారు. తరవాత విడిపోయారు. అయితే ఇన్నాళ్ల తర్వాత కూడా పెళ్లి వేదిక వద్దకు తోసుకువెళ్లేందుకు అలెగ్జాండర్ ప్రయత్నించాడు.
ఇది కూడా చదవండి: Sai Dhanshika: ‘కామెడీ స్టార్స్’లో మెరిసిన కబాలి బ్యూటీ ధన్సిక!
40 ఏళ్ల పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ ఇటీవలే సంరక్షణ కేసు నుంచి బయటపడింది. 13 ఏళ్ల పాటు ఆమె తండ్రి సంరక్షణలోనే ఉన్నారు. అందువల్ల పెళ్లి చేసుకోలేకపోతున్నానని, పిల్లల్ని కనలేకపోతున్నట్లు బ్రిట్నీ ఓ సందర్భంలో తెలిపింది. ఈ క్రమంలో పర్సనల్ ట్రైనర్ అస్‌ఘరితో 2016లో స్పియర్స్‌కు పరిచయం ఏర్పడింది. స్లంబర్ పార్టీ మ్యూజిక్ ఆల్బమ్ రూపొందిస్తున్న సమయంలో ఆ ఇద్దరూ స్నేహితులయ్యారు. ఇప్పుడు పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి ప్రవేశించింది బ్రిట్నీ స్పియర్. ఈ వార్త తెలిసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Sai Pallavi: తన పెళ్లిపై నోరువిప్పిన సాయిపల్లవి.. వీడియో వైరల్!