కామెడీకి ఆయన కేరాఫ్ అడ్రస్, ఒక్క ఎక్స్ ప్రెషన్ తోనే కడుపుబ్బా నవ్వించగలడు. మీమర్స్ కు ఆయన ఒక రీసర్చ్ సబ్జెక్ట్ లాంటోడు. ఆయన మాట, చూపు, కోపం ఏదైనా కామెడీనే. నవ్విస్తూ గిన్నిస్ బుక్ ఎక్కేశాడు. ఆయనే హాస్యబ్రహ్మ బ్రహ్మానందం. చాలా గ్యాప్ తర్వాత ఆలీతో సరదాగా షోలో తన మార్క్ కామెడీని చూపించారు. ఆలీతో సరదాగా షోలో బ్రహ్మానందం పంచిన కామెడి అంతా ఇంతా కాదు.
ఆ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తెగ వైరల్ అవుతోంది. బ్రహ్మానందం అనగానే అందరికీ సినిమాలు ఎంత గుర్తొస్తాయో.. మీమ్స్ కూడా అంతే గుర్తొస్తాయి. మీమర్స్ కు సంబంధించి అడిగిన ప్రశ్నకు ఆయన చాలా సింపుల్ గా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘ఇంతకాలం నేను సినిమాకు దూరంగా ఉన్నా.. నన్ను మర్చిపోనీకుండా చేసింది వాళ్లే.. వాళ్ల నాకెందుకు కోపం’ అంటూ మీమర్స్ పై తనకున్న అభిమానాన్ని ప్రదర్శించారు బ్రహ్మానందం. మరి ఆ ఇంట్రస్టింగ్ ప్రోమోను మీరు చూసేయండి.