సమాజంలో విడాకుల అనేది సర్వసాధారణ విషయం. ఇద్దరు మనుషుల మనస్సుల మధ్య ఏర్పడే మనస్పర్ధలు, ఇతర కారణాలు విడాకులకు దారితీస్తాయి. సామాన్యుల నుంచి ప్రముఖల వరకు చాలా మంది విడాకులు తీసుకున్నారు. అయితే సినీ ఇండస్ట్రీలో ఈ విడిపోవడం అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ పరిశ్రమలో ఈ విడాకుల ట్రెండ్ ఎక్కువగానే ఉంటుంది. అయితే అలా విడిపోయే సమయంలో భరణంగా కొంత డబ్బులు, ఆస్తులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే బాలీవుడ్ ప్రముఖ సింగర్ హానీసింగ్ తన భార్య షాలిని తల్వార్ తో మనస్పర్థాల కారణంగా విడాకులు తీసుకున్నాడు. అయితే తాజాగా హనీ సింగ్ .. తన మాజీ భార్యకు భరణంగా కోటి రూపాయాలు ఇచ్చాడు.
బాలీవుడ్ ర్యాపర్, మ్యూజిక్ కంపోజర్ యో యో హనీసింగ్ షాలిని సుమారు పదేళ్ల క్రితం 2011లో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం వీరి మధ్య చిన్న చిన్న మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఇవి చివరకి విడాకులు తీసుకునే వరకు వెళ్లాయి. అయితే ఈ వ్యవహారం కంటే ముందు హానిసింగ్ తనను లైంగికంగా , మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని షాలిని ఆరోపించింది. అంతేకాక ఇతర మహిళలతో హనీ సింగ్ వివాహేత సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ షాలిని గతేడాది ఢిల్లీలోని తీస్ హజరీ కోర్టులో పిటిషన్ ధాఖలు చేసింది. గృహహింస నిరోధక చట్టం కింద దాఖలు చేసిన ఈ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది.
ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం విచారణ అనంతరం వీరికి విడాకులు మంజూరు చేసింది. అయితే తనకు భరణంగా రూ.10 కోట్లు ఇవ్వాలంటూ షాలిని తల్వార్ కోరింది. అయితే అనేక చర్చల అనంతరం కోటి రూపాయల భరణానికి ఇద్దరూ అంగీకరించారు. మరి..దీంతో హనీసింగ్ తన పదేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికాడు. కోటి రూపాయలు ఇచ్చి షాలినితో తెగదెంపులు చేసుకున్నాడు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.