ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదో ఓ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు మృతి చెందుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ పాప్ సింగర్ తాజ్(54) (తర్సామీ సింగ్ సైనీ) కన్ను మూశారు. జానీ జీగా పేరు పొందిన తర్సామీ సింగ్ సైనీ గత కొంతకాలంగా హెర్నియా వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా కూడా సోకినట్లు తెలిసింది. అయితే కోవిడ్‌కి చికిత్స ఆలస్యం కావడంతో.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి.. కోమాలోకి వెళ్లినట్లు తెలిసింది. అయితే ఇటీవలే కోమా నుంచి కోలుకున్న తాజ్.. శుక్రవారం ఏప్రిల్ 29న యూకేలో మరణించారు. దీని గురించి ఆయన కుటుంబ సభ్యుల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇది కూడా చదవండి: Yash: KGF తో మారిన యశ్ జీవితం.. సంపాదన డబుల్
తాజ్ గ్రూప్ స్టీరియో నేషన్ అనగానే.. 1990లలో ప్రసిద్ధి చెందిన ప్యార్ హో గయా, నాచేంగే సారి రాత్, గల్లాన్ గోరియన్ వంటి హిట్ సాంగ్స్ గుర్తుకు వస్తాయి. ఇది 1996లో ఏర్పడింది. 1989లో హిట్ ది డెక్ ఆల్బమ్‌తో తాజ్ స్టీరియో నేషన్ ప్రజాదరణ పొందింది. యూకేలోని ఇతర భారతీయ కళాకారులతో పాటు తాజ్.. ఆసియా ఫ్యూజన్ సంగీతానికి మార్గదర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. డోంట్ స్టాప్ డ్రీమింగ్, సాంబార్ సల్సా వంటి చిత్రాలలో తాజ్ పనిచేశారు. తుమ్ బిన్, కోయి మిల్ గయా, రేస్ వంటి పాపులర్ హిందీ మూవీస్తోపాటు ఇటీవల వచ్చిన బట్లా హౌజ్ సినిమాలో పాటలు పాడారు. తాజ్ మృతిపై పలువరు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Andrea: ‘పిశాచి -2′ కోసం హీరోయిన్ ఆండ్రియా సాహసం! 15 నిమిషాల పాటు వివస్త్రగా!