బాలీవుడ్ లో ఎంతో మంది నటీమణులు తెలుగులో ఐటమ్ సాంగ్స్ లో నటించారు.. కొన్ని పాటలే ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఉంటాయి. మోడల్ గా కెరీర్ ఆరంభించి బుల్లితెర, వెండితెరపై తమ సత్తా చాటుతున్నారు నటీమణులు.
తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది బాలీవుడ్ నటీమణులు ఐటమ్ సాంగ్స్ తో కుర్రాళ్లకు కిర్రెక్కించారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. మూవీలో “నా పేరు కంచన్ మాలా” పాటతో కుర్రాళ్ల మనసు కొల్లగొట్టింది బాలీవుడ్ బ్యూటీ గౌహర్ ఖాన్. ఆ తర్వాత బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిగా తన సత్తా చాటుకుంది. బాలీవుడ్ బిగ్ బాస్ 7 లో సందడి చేసింది. తాజాగా గౌహర్ ఖాన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్ట్రాగామ్ లో షేర్ చేసింది. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ లో మోడల్ గా కెరీర్ ఆరంభించిన గౌహర్ ఖాన్ 2002లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొంది. ఆ తర్వాత సినీ రంగంపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే బుల్లితెరపై పలు ఆఫర్లు దక్కించుకుంది. యాంకర్ గా తన సత్తా చాటింది. సల్మాన్ ఖాన్ హూస్ట్ చేసిన బిగ్ బాస్ 7 లో పాల్గొంని కంటిస్టెంట్స్ కి గట్టి పోటీ ఇచ్చింది. బుల్లితెరపైనే కాదు.. వెండితెరపై కూడా తన సత్తా చాటుతూ వచ్చింది. తాజాగా గౌహర్ ఖాన్ పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోష విషయాన్ని తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. గత ఏడాది డిసెంబర్ లో తాను తల్లిని కాబోతున్నా అంటూ ప్రకటించింది.
ఆ మద్య గౌహర్ ఖాన్ సీమంతానికి సంబంధించిన ఫోటోలు కూడా తన ఇన్‌స్ట్రాగామ్ లో షేర్ చేసింది. గౌహార్ ఖాన్ 2009లో రాకెట్ సింగ్ : సేల్స్ మెన్ ఆఫ్ ద ఇయర్ మూవీతో కెరీర్ ఆరంభించింది. గేమ్, 14 ఫెరె వంటి చిత్రాల్లో నటించింది. బాలీవుడ్ లో ఎన్నో రియాల్టీషోలో పాల్గొంది. తాండవ్, స్టాల్ సిటీ, శిక్ష మాండల్ వెబ్ సీరీస్ లో నటించింది. ప్రముఖ గాయకుడు, కంపోజర్ ఇస్మాయిల్ దర్భార్ కుమారుడైన్ జైద్ దర్బార్ ని 2020 లో వివాహం చేసుకుంది గౌహార్ ఖాన్. బాబు పుట్టిన విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.