సెలబ్రిటీలు.. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన వారు, హై ప్రొఫైల్ పర్సన్స్ ఎక్కువగా అర్థరాత్రి పార్టీలకు ప్రాధాన్యత ఇస్తారు. పబ్బులకు వెళ్లి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక తెలంగాణలో రెండు రోజుల నుంచి ఫుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారం ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరోసారి పబ్‌కు సంబంధించి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సారి దొంగతనానికి సంబంధించిన వార్త. స్నేహితులతో కలిసి పబ్‌కు వెళ్లిన నటి.. తన ఫోన్ పోగొట్టుకుంది. ఫోన్ ఖరీదు ఏకంగా లక్ష రూపాయలు కావడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: పోలీస్ కావాలన్నది ఆమె కల.. పోర్న్ స్టార్ అయ్యింది!
ఈ ఘటన ముంబైలో జరిగింది. బాలీవుడ్ ప్రముఖ నటి, సింగర్ గరిమా జైన్‌కు పబ్బులో ఈ చేదు అనుభవం ఎదురయ్యింది. గరిమా… ఏప్రిల్ 2న ఫ్రెండ్స్‌తో కలిసి ముంబై ఎయిర్ పోర్టుకు దగ్గర్లో ఉన్న పబ్‌కు వెళ్లింది. స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసింది. తిరిగి తెల్లవారుజామన 3.15 సమయంలో పబ్ నుంచి ఇంటికి బయల్దేరారు. ఆ సమయంలో గరిమా తన ఫ్రెండ్స్‌కు కాల్ చేసేందుకు ఫోన్ కోసం చూసింది. అయితే తన సెల్ ఫోన్ దొరకలేదు. ఎంత వెతికినా లాభం లేకుండా పోయింది. పోయిన మొబైల్ ఖరీదు ఏకంగా లక్ష రూపాయలు కావడంతో తీవ్రంగా ఆందోళన చెందింది.
ఇది కూడా చదవండి: తళపతి విజయ్ కి షాకిచ్చిన ప్రభుత్వం! అక్కడ బీస్ట్ సినిమా బ్యాన్
వెంటనే దీని గురించి గరిమా పబ్ నిర్వాహకులతో పాటు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎయిర్ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పబ్‌లో పనిచేసేవాళ్లను కూడా విచారిస్తున్నారు పోలీసులు. పబ్‌లో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్‌ను కూడా పరిశీలించి నిందితుడ్ని గుర్తించే పనిలో పడ్డారు. గరిమా ఫోన్ నెంబర్‌కు కాల్ చేస్తుంటే…స్విచ్ఛాప్ వస్తున్నట్లు తెలిపారు. మరి గరిమా ఫోన్ దొరుకుతుందో లేదో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: MLA బాలకృష్ణకు ఏపీ ప్రభుత్వం షాక్! డిప్యూటేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు!