బిగ్ బాస్ లవర్స్ కి మళ్లీ కొత్త సీజన్ మొదలైంది. ఇదివరకు టీవీలో ఒకటి, రెండు గంటలపాటు అలరించిన బిగ్ బాస్.. ఈసారి ఓటిటి సీజన్ తో 24 గంటలపాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కాబోతుంది. అయితే.. గత సీజన్లు హోస్ట్ చేసిన అక్కినేని నాగార్జున ఈ ఓటిటి సీజన్ ని కూడా హోస్ట్ చేయనున్నారు. ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలు సెట్ చేసిన బిగ్ బాస్ ఓటిటి యాజమాన్యం.. కొద్దిరోజులుగా ప్రోమోలు రిలీజ్ చేస్తూ ఆసక్తి రేపుతోంది.
బిగ్ బాస్ ఓటిటి సీజన్ లో మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ పాల్గొనబోతున్నారు. మరి ఎవరెవరు పాల్గొంటారా? అని తెలుసుకోవాలనే ఉత్సాహం టీవీ ప్రేక్షకులతో పాటు సోషల్ మీడియా వినియోగదారులలో కూడా కనిపిస్తుంది. తాజాగా బిగ్ బాస్ హౌస్ ఇలా ఉండబోతుంది.. అంటూ మరో ప్రోమో వదిలారు నిర్వాహకులు. ఈ ప్రోమోలో బిగ్ బాస్ హౌస్ చూపిస్తూ ఇకపై బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రసారం కానుందని చెప్పుకొచ్చారు.ఇక బిగ్ బాస్ లో పాల్గొనేవారు వీరేనంటూ కొందరి పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి వారంతా ఎవరు అనేది ఫిబ్రవరి 26న సాయంత్రం 6 గంటల నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో పరిచయం కానున్నారు. అయితే.. ఈ ఓటిటి సీజన్ లో ఇదివరకు బిగ్ బాస్ గత సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా కనిపించనుండటం విశేషం. మరి ఈ కొత్త ప్రోమో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.