బుల్లితెరపై వస్తున్న పాపులర్ షో బిగ్ బాస్ లో పాల్గొని అందరి మనసు గెల్చుకొని విన్నర్ గా నిలిచాడు వీజే సన్నీ. బిగ్ బాస్ విన్నర్ గా బయటికి వచ్చిన సన్నీకి వరుస ఆఫర్లు రావడం మొదలయ్యాయి. ప్రస్తుతం వీజే సన్ని దిల్‌రాజ్ ప్రొడక్షన్‌లో ఓ మూవీలో నటిస్తున్నాడు. తాజాగా వీజే సన్నిపై కొంత మంది దాడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే..
బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వీజే సన్నీ గతంలో పలు టీవీ షోల్లో కనిపించాడు. తనదైన మేనరీజంతో అందరి హృదయాలు గెలుచుకోవడమే కాకుండా… బిగ్‌బాస్ సీజన్ 5 కప్పు అందుకున్నాడు. ప్రస్తుతం సన్నీ పలు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ‘సకల గుణాభిరామ’ సినిమాలో హీరోగా నటించిన సన్నీ, ‘సన్నాఫ్ ఇండియా’ మూవీ డైరెక్టర్ డైమాండ్ రత్నబాబుతో కొత్త మూవీ ప్రకటించాడు.
ఇది కూడా చదవండి: Swiggy Boy: వైరల్ వీడియో: ట్రాఫిక్ పోలీస్ ఓవరాక్షన్.. అకారణంగా స్విగ్గీ బాయ్‌పై దాడి..
హస్తినాపురంలో మూవీ షూటింగ్ లో సన్నీ ఉన్నపుడు ఓ రౌడీషీటర్ ఒక్కసారిగా వీరంగం సృష్టించారు. వెంటనే అలర్ట్ అయిన మూవీ సిబ్బంది వీజే సన్నీని కారులో అక్కడ నుంచి పంపించివేశారు. వీజే సన్నీపై దాడి జరిగిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ రౌడీ షీటర్ ని అరెస్ట్ చేశారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.