బోల్డ్ కంటెట్ తో క్రేజ్ సంపాదించుకుని.. ఆ తర్వాత బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ కంటెస్టెంట్ గా మారిన సరయుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియా ఫాలో అయ్యే అందరికీ ఆమె సుపరిచితురాలే. తాజాగా సరయు ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సరయు ఒక వీడియోలో నటించిందని ఆమెపై ఫిర్యాదు చేశారు. ఆ కేసుకు సంబంధించి సోమవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులు సరయును అదుపులోకి తీసుకున్నారు. ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించారు.
సరయు అరెస్టు#Sarayu #BiggBossFame #Police #VHPLeader #PoliceCasehttps://t.co/hObPmMbst3 pic.twitter.com/BsscX35gV8
— Webdunia Telugu (@WebduniaTelugu) February 8, 2022
ఓ హోటల్ ప్రచార పాటలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించారంటూ వీహెచ్ పీ నేత సరయూపై ఫిర్యాదు చేశారు. సరయుపై ఐపీసీ సెక్షన్ 153ఏ, 295ఏ కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వీడియోపై రాజన్న సిరిసిల్ల విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు చేపూరి అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసును బంజారాహిల్స్ పోలీసులకు ట్రాన్స్ ఫర్ చేశారు.
యూట్యూబ్ నటి #సరయు ని అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. హిందువుల విశ్వాసాలను దెబ్బేతీసేలా వీడియో లో నటించిన సరయు..
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు..#sarayu#YouTube pic.twitter.com/sfWxLCATzU— AP_2024 (@Andhra2024) February 7, 2022
అసలు జరిగిందేంటంటే.. ఓ హెటల్ ప్రచార పాటలో తలకు గణపతి బప్పా మోరియా అనే రిబ్బన్లు కట్టుకున్నారు. దానిపై వీహెచ్ పీ నేత అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవుడి బొమ్మలు ధరించి మద్యం సేవించి హోటల్ ను సందర్శిస్తారనే సంకేతాన్ని ఆ ప్రచార గీతం ద్వారా పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరయు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలను సహించమని హెచ్చరించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.