బిగ్ బాస్ షోలో పాల్గొని అవకాశాలు తెచ్చుకున్న వారిలో పలువురు ఉన్నారు. హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని, కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి వారిలో నందిని రాయ్ కూడా ఒకరు. ఇప్పుడు ఆమె పుట్టినరోజు వేడుకలు.. ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా జరిగాయి. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సినీ తారలు హాజరై సందడి చేశారు. ఇందులో సాయికుమార్, వరుణ్ సందేశ్, రాజ్ తరుణ్, డైరెక్టర్ సతీష్ వేగేశ్న, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రాహుల్ సిప్లిగంజ్, తనీష్, సొహెల్, భానుశ్రీ, లహరి, వైవా హర్ష, చౌందిని చౌదరి తదితరులు ఉన్నారు.
ఇక నందిని రాయ్ కెరీర్ విషయానికొస్తే.. సికింద్రాబాద్ లో పుట్టిపెరిగిన ఈమె చిన్న వయసులోనే మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే పలు అందాల పోటీల్లో పాల్గొని మోడల్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2011లో వచ్చిన 040 చిత్రంతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత మాయ, ఖుషీఖుషీగా, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్, శివరంజని తదితర సినిమాల్లో హీరోయిన్, సహాయ పాత్రల్లో నటించింది. అలా కొన్నాళ్లకు బిగ్ బాస్ 2లోనూ ఓ కంటెస్టెంట్ గా పాల్గొని తనదైన ఆటతో ప్రేక్షకుల్ని మెప్పించింది.ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత ముందుకంటే ఎక్కువ ఆఫర్లే దక్కించుకుంది.
ఈ క్రమంలోనే పలు సినిమాలు, వెబ్ సిరీసుల్లో కీలక పాత్రల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఈ మధ్య సాయికుమార్, రాధిక నటించిన ‘గాలివాన’ వెబ్ సిరీస్ లో ఓ కీలకపాత్ర చేసి ఆకట్టుకుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే నందిని రాయ్.. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్స్ కి కనులవిందు చేస్తూనే ఉంది. ఇప్పుడు బర్త్ డే వేడుకలోనూ బ్రౌన్ కలర్ ఔట్ ఫిట్ లో అందంగా కనిపించింది. ప్రేక్షకులైతే ఆమె నటనతో పాటు గ్లామర్ కి ఫిదా అయ్యారు. మరి నందిని రాయ్ పుట్టినరోజు వేడుకలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Actress Nandini Rai Birthday Bash 2022 HD Gallery
#Actress #NandiniRaihttps://t.co/1oym2tNzhI pic.twitter.com/owHjZLNpt2
— #Rajanna(G🌐pi AdusuⓂilli) (@agk4444) September 18, 2022
ఇదీ చదవండి: సినిమా ఛాన్స్ ఇస్తాం.. కోరిక తీరుస్తావా అని అడిగారు: విష్ణుప్రియ