“పుష్ప” ఏ క్షణాన సుకుమార్ ఈ సినిమాని మొదలు పెట్టాడో తెలియదు గాని.. ఇప్పుడు పుష్ప మేనియా దేశాన్ని షేక్ చేస్తోంది. సామాన్యుల నుండి సెలబ్రటీల వరకు ‘తగ్గేదే లే’ అంటూ డైలాగులు చెప్పేస్తున్నారు. పుష్ప పాటలు పడేస్తున్నారు. స్టెప్పులు వేసేస్తున్నారు. ఇక పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో.. ఇందులో నటించిన నటీనటులు అందరికి మంచి పేరు వచ్చింది. అయితే.. ఇందులో పుష్పరాజ్ స్నేహితుడి పాత్రలో నటించిన కేశవ పాత్ర సినిమా మొత్తం మీద సూపర్ గా హైలెట్ అయ్యింది. ఈ క్యారెక్టర్ చేసింది జగదీష్ ప్రతాప్ భండారీ అనే నటుడు.
తనకి చిత్తూరు యాస రాకపోయినా.., సినిమా కోసం ఆ యాస నేర్చుకుని, మచ్చా అంటూ నవ్వులు పూయించాడు కేశవ. పైగా.., పుష్ప కథని నేరేట్ చేసేది కూడా కేశవ క్యారక్టరే. ఒక అప్ కమింగ్ యాక్టర్ కి పాన్ ఇండియా మూవీలో ఇంత ఇంపార్టెంట్ రోల్ దక్కడం అదృష్టమనే చెప్పుకోవాలి. ఆ అదృష్టం జగదీష్ కి దక్కింది. కానీ.., ఈ విషయంలో తాజాగా ఓ షాకింగ్ ట్విస్ట్ బయట పడింది. అసలు కేశవ క్యారెక్టర్ కి ముందుగా అనుకుంది బిగ్ బాస్ ఫేమ్ మహేశ్ విట్టాని అట. ఈ విషయాన్ని స్వయంగా మహేశ్ బయట పెట్టాడు.
కేశవ పాత్ర కోసం సుకుమార్ సర్ నన్ను పిలిపించారు. క్యారెక్టర్ డీటైల్స్ అన్నీ నేరేట్ చేశారు. కథ విన్నప్పుడే చాలా మంచి పాత్ర అనిపించింది. కానీ.., ఈ ఒక్క సినిమా కోసం నేను రెండేళ్ల సమయాన్ని కేటాయించలేను అనుకుని, ఆ స్థానంలో వేరే నటుడిని సెలక్ట్ చేసుకున్నట్టు ఉన్నారు. సినిమా చూస్తున్నంత సేపు ఆ క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది అని అనిపించిందని మహేశ్ విట్టా అసలు నిజాన్ని బయట పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. చిత్తూరు యాసపై మంచి పట్టున్న మహేశ్ ని కాదని.. దర్శకుడు సుకుమార్.. కేశవ క్యారెక్టర్ ని జగదీశ్ కి ఎందుకు ఇచ్చినట్టు? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.