ఎక్స్ పోజింగ్ చేయడమే కాదు బోల్డ్ గా మాట్లాడుతూ బాగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది బిగ్ బాస్ దివి. ఇక ఈ అమ్మడు తాజాగా చూపించిన అందాలకి ఫిదా అవ్వడం సంగతి అలా ఉంచితే నెటిజన్లు ఈ హాట్ బ్యూటీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకు దివి ఏం చేసిందంటే?
బిగ్ బాస్ ఫేమ్ దివికి ఆకర్షించే అందమున్నా,.. అవకాశాలు మాత్రం రావట్లేదు. దీంతో ఆఫర్ల కోసం ఈ అమ్మడు అందాలను ఆరబోయక తప్పట్లేదు. ఇక ఈ పొడుగు సుందరి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పుడూ హాట్ ఫొటోలతో కుర్రాళ్లకు సెగలు పుట్టించడంలో ఈ బ్యూటీ ముందు వరసలో ఉంటుంది. ఎక్స్ పోజింగ్ చేయడమే కాదు బోల్డ్ గా మాట్లాడుతూ బాగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ ని పెంచేస్తూ “ఈ అమ్మడు మరి ఇంత హాట్” అనేవిధంగా తయారైంది. ఈ క్రమంలో కొన్నిసార్లు శృతిమించిన అందాల ఆరబోతతో రెచ్చిపోతుంది. ఇక ఈ అమ్మడు తాజాగా చూపించిన అందాలకి ఫిదా అవ్వడం సంగతి అలా ఉంచితే నెటిజన్లు ఈ హాట్ బ్యూటీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకు దివి ఏం చేసిందంటే?
సీజన్ 4 బిగ్ బాస్ లో అడుగుపెట్టిన దివి ఆట కన్నా అందంతోనే ఎక్కువగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. హౌస్ నుండి బయటకు వచ్చిన ఈ అమ్మడుకి బాగానే అవకాశాలు వస్తాయని భావించారంతా. మంచి హైట్, ఫిజిక్, గ్లామర్ ఉన్న దివికి ఆఫర్లు మాత్రం కరువయ్యాయి. దీంతో అవకాశాలు కోసం ఎప్పటికప్పుడు ఈ అమ్మడు కాస్త హద్దు మీరే ప్రయత్నం చేస్తుందనే టాక్ ఉంది. ఒక్కోసారి ఈ భామ ఇచ్చే బిల్డప్ చూస్తుంటే.. స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉంటుంది. చిరంజీవి సినిమాలో అవకాశం దక్కించుకున్నా ఆ సినిమాలో అంతగా ఆకట్టుకోకపోవడంతో దివిని ఎవరూ పట్టించుకోలేదు. నెట్టింట్లో ఎప్పుడు సందడి చేస్తూ కనిపించే దివికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడు హాట్ ఫోటో షూట్ లతో బిజీ అయిపోయే ఈ అమ్మడు తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో దివి ఓ షోరూమ్ లో కార్ ఓపెనింగ్ చేస్తూ కనిపించింది. ఈ సందర్భంగా ఈ బిగ్ బాస్ బ్యూటీ ప్యాంట్ వేసుకోకుండా కేవలం పొట్టి టీ షర్ట్ లో కనిపించి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది.
సాధారణంగా ఇలాంటి డ్రెస్ లో కనిపించడం పెద్దగా ఆశ్చర్యం లేదు. కానీ ట్రెడిషనల్ లాంచింగ్ ఫంక్షన్లలో కూడా శృతి మించిన అందాలతో కనిపించడం కాస్త అతిగానే కనిపిస్తుందని చెప్పుకుంటున్నారు నెటిజన్లు. దీంతో ఇప్పుడు దివి మీద ట్రోల్ల్స్ మొదలయ్యాయి. నువ్వేమైనా పెద్ద సెలబ్రిటీనా ఇంతలా రెచ్చిపోతున్నావు అని కామెంట్ చేస్తుంటే.. ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఎప్పుడు హాట్ లుక్కులో రెచ్చిపోయే దివి ఈ సారి కూడా తనదైన స్టయిల్లో ఎక్స్ పోజింగ్ తో చూపు తిప్పుకోనీయకుండా చేసింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.