బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ దక్కించుకున్న తెలుగు మోడల్ దివి. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ అయిన దివి.. ఫైనల్ వరకు ఉండలేకపోయింది కానీ తన అందంతో టీవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అప్పటినుండి సోషల్ మీడియా క్రేజ్ తో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటూ కెరీర్ పరంగా, వ్యక్తిగత జీవితం పరంగా కొత్త విషయాలు షేర్ చేసుకుంటుంది.
ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే దివి.. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పెళ్లి ఎప్పుడు? అనే ప్రశ్నకు వీడియో ద్వారా షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ఆ వీడియోలో దివి మాట్లాడుతూ.. ‘మరి కొద్ది రోజుల్లోనే’ అని సమాధానం ఇచ్చింది. దీంతో ఎవరిని చేసుకుంటున్నావు? అంటూ నెటిజన్లు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. కానీ ఆ వీడియో చూస్తే ఊరికే తమాషాకు చేసినట్లు తెలుస్తుంది.
సాధారణంగా సెలెబ్రిటీలు ఏదైనా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుంటారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దివి సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో కెరీర్ ని పక్కన పెట్టి పెళ్లి అయితే చేసుకోదులే అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక దివి మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మరి దివి పెళ్లి వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.