7ఆర్ట్స్ సరయ.. బిగ్ బాస్ 5 తెలుగులోకి ఎంటర్ అయి మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్. ఉన్న ఒక్క వారంలోనే సరయు తన మార్క్ తో హౌస్ లో ముద్రవేసుకునే ప్రయత్నం చేసింది. దీంతో సరయు ఎలిమినేట్ అయిన వెంటనే హౌస్ లో ఉన్న షణ్ముఖ్, సిరి వంటి కంటెస్టెంట్ లే కాకుండా మిగత కంటెస్టెంట్ లపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడి నానా రచ్చ చేసింది. దీంతో కోపంతో రగిలిపోయిన షణ్ముఖ్ ఫ్యాన్స్ నాకు ఫోన్ లు చేసి వార్నింగ్ ఇచ్చారని సరయు తెలిపింది.
ఇక ఇంతటితో ఆగిందా అంటే అది లేదు. తన 7ఆర్ట్స్ యూ ట్యూబ్ ఛానల్ వేదికగా సిరి, షణ్ముఖ్ తో ఉన్న గొడవలపై వారి ఆట తీరును తీవ్రంగా విమర్శిస్తూ తను హౌస్ లో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలను క్లిప్పింగ్స్ తో సహా చూపించి సరయు రచ్చ రచ్చ చేసింది. ఇక ఇప్పుడు విషయం ఏంటంటే? సరయు ఇటీవల ఓ మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొని తన లవ్ స్టోరీ, బ్రేకప్ వంటి పూర్తి వివరాలు తెలియజేసే ప్రయత్నం చేసింది. నేను గతంలో ఏడేళ్లుగా ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నానని, అది మా ఇంట్లో వాళ్లికి అబ్బాయి ఇంట్లో వాళ్లికి కూడా తెలిసిందని సరయు చెప్పుకొచ్చింది.
నేను అతనితో రిలేషన్ లో ఉన్నప్పుడు నా కెరియర్ మొత్తాన్ని త్యాగం చేశాను. అయినా నేనే వర్జిన్ ను కూడా కాదంటూ సరయు సంచనలనమైన విషయాలు తెలిపింది. ఇక ఎలాగైన పెళ్లి చేసుకుందామనుకుని పెద్దలను కూడా ఒప్పించాం. కానీ అబ్బాయి వాళ్లు కట్నం ఎక్కువగా డిమాండ్ చేయటంతో మా ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. పెళ్లి కాకముందే ఇన్ని గొడవలు చేసి భారీగా కట్నం డిమాండ్ చేయటంతో అది నాకు నచ్చలేదు. దీంతో నేనే స్వయంగా అతడు వద్దనుకుని నువ్వు నాకు సరైన వ్యక్తివి కావంటూ నిర్మొహమాటం లేకుండా చెప్పేశానంటూ సరయు తెలిపింది. ఇక సరయు లవ్ స్టోరీ, బ్రేకప్ వంటి విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.