బిగ్‌బాస్ షోతో కావాల్సినంత పాపులారిటీని పొందిన ముద్దుగుమ్మలు ఇప్పుడు ఏది చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రెండు రోజుల క్రితం బోల్డ్ బ్యూటీ అరియానా కియా కారు కొని సోహెల్, అమర్ దీప్‌తో చేసిన సందడి నెట్టింట హైలెట్ అయింది. ఇప్పుడు ఆ సందడిని రిపీట్ చేసే టైం మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్ దేవీది. దేవీ కూడా స్కొడా కారు కొన్నారు. కొత్త కారుకు పూజ చేయించి దాని ముందు నిలబడి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ వెంటవెంటనే కొత్తకార్లు కొనడంతో వారి ఆనందం డబుల్ అయింది.
కాగా దేవీ ప్రముఖ న్యూస్ చానెల్‌లో పని చేస్తున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్ 4 లో పాల్గొని తర్వాత కూడా తన వృత్తిని కొనసాగిస్తున్నారు. అరియానా సినిమాల్లో చేస్తున్నారు. కాగా ఈ ఇద్దరు కార్ల ముందు నిలబడి దిగిన ఫోటోలను జత చేస్తు హమిదాఖాతున్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇద్దరికి కంగ్రాట్స్ చెప్పారు. ఇంతకీ వాళ్లు కొన్న కార్ల మోడల్ ధర గురించి చెప్పలేదు కదూ.. దేవీ నాగవల్లి స్కొడా అక్టావియా ఆటోమేటిక్ మోడల్ కారు కొన్నారు. దాని ధర రూ.20-26 లక్షలు ఉంటుంది. అరియానా కారు కియా సెల్టాస్ మోడల్ కారు, ధర రూ.15-18 లక్షలు ఉంటుందని సమాచారం.