సదరు నటి ఓ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ జ్యోతి ప్రజ్వలన సందర్భంగా స్టేజి మీదకు చేరుకున్నారు. కొద్దిసేపటి తర్వాత స్టేజిమీద ఉన్న కొంతమంది ఆమెను దీపపు కుందె దగ్గరకు తీసుకెళ్లారు. అప్పుడు ఆమె..
సినిమా వాళ్లు తరుచుగా వివాదాల్లోకి రావటం జరుగుతూ ఉంటుంది. వారు చేసే చిన్న పనులను కూడా ప్రజలు, మీడియా బూతద్దంలో పెట్టి చూస్తుంటాయి. ఏ చిన్న తప్పు చేసినా వారిని టార్గెట్ చేసేస్తుంటాయి. తాజాగా, ప్రముఖ బాలీవుడ్ నటి భూమీ పడ్నేకర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈ సారి ఆమె తన చెప్పులు విడవటానికి అసిస్టెంట్ సహాయం చేసుకోవటం రచ్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. భూమి పడ్నేకర్ తాజాగా ఓ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన జరిగింది. దీపం కుందె ఉన్న స్టేజిమీదకు అతిధులంతా ఎక్కారు. వారిలో భూమీ పడ్నేకర్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దీపపు కుందె దగ్గరకు రావాలని కొంతమంది ఆమెకు చెప్పారు. దీంతో భూమీ పడ్నేకర్ చెప్పులు విడవటానికి ప్రయత్నించింది.
అయితే, వాటిని తీయటం ఆమె వల్ల కాలేదు. స్టేజిమీదనుంచి కిందకు దిగింది. అప్పుడు ఆమె అసిస్టెంట్ ఆమెకు సహాయం చేశాడు. తర్వాత ఆమె దీపపు కుందె దగ్గరకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసిస్టెంట్‌తో ఆమె చెప్పులు తీయించుకోవటాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. భూమీ చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. కాగా, భూమీ తన పెళ్లి విషయంలో కూడా ట్రోలింగ్స్‌కు గురయ్యారు. వేరే మతానికి చెందిన వ్యక్తిని చేసుకోవటంతో కొంతమంది ఆమెను విమర్శించటం మొదలుపెట్టారు. మరి, భూమీ తన అసిస్టెంట్‌తో చెప్పులు తీయించుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.