తెలుగుసినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి పండుగ అతిపెద్ద సీజన్. య్యావరేజ్ సినిమాలు కూడా భారీ వసూళ్లు పొందేది సంక్రాంతి సీజన్‌లోనే. ఇక సినిమా సూపర్ హిట్ టాక్‌ను పొందిందా కలెక్షన్ల సునామీనే. అందుకే పెద్దపెద్ద సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతాయి. ఈ క్రమంలో స్టార్ హీరోల సినిమాల మధ్య పోటీ కూడా ఉంటుంది. ఈ పోటీని సినీ అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తారు. ఇలా సాగే సినీ సంక్రాంతికి పందెం కోళ్లలా తలపడుతుంటారు మన హీరోలు. ఇక 2022 సంక్రాంతికి పోటీ భీకరంగా ఉంది దానికి కారణం ఇండస్ట్రీలోనే టాప్ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ‘బ్లీమానాయక్’, సూపర్‌స్టార్ మహేష్‌బాబు ‘సర్కారువారి పాట’, యంగ్‌రెబల్ స్టార్ ‘రాధేశ్యామ్’ ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. వీరికితోడు తమిళ సూపర్‌స్టార్లు విజయ్ నటించిన ‘బీస్ట్’, అజిత్ నటించిన వాలిమై సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. కాగా ప్రధానంగా పోటీ మాత్రం పవన్, మహేష్, ప్రభాస్ మధ్యే ఉండబోతుంది. చూద్దాం మరీ ఎవరు సంక్రాంతి పందెం కోడి అని నిరూపించుకుంటారో. మరీ ఇంట్రస్టింగ్ సంక్రాంతి వార్‌లో ఏ హీరో సినిమా పెద్ద విజయం సాధిస్తుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.